బెయిల్ కోసం హైకోర్టుకు లోకేశ్ - పాదయాత్ర వేళ ఉత్కంఠ..!!

టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. అమరావతి(Amaravati) ఇన్నర్ రింగ్ రోడ్డులో లోకేశ్ ను ఏ 14గా చేర్చటంతో ఈ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నెల 29వ తేదీ నుంచి లోకేశ్ తన యువగళం(Yuvagalam) యాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. తన యాత్ర చేసుకొనేందుకు వీలుగా ముందస్తు బెయిల్(Bail) ఇవ్వాలని లోకేశ్ కోరారు. దీంతో, ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

లోకేశ్ బెయిల్ పిటీషన్: ఏపీలో టీడీపీ నేతలు కేసుల ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే స్కిల్ స్కాం(Skill Scam)లో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు నారా లోకేశ్ ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అనైన్ మెంట్ కేసులో ఏ 14గా సీఐడీ పేర్కొంది. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేసింది. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత లోకేశ్ ఢిల్లీ వెళ్లారు.

Nara Lokesh files anticipatory bail in Amaravati outer ring road case in high Court

అక్కడ తన తండ్రి కేసుల వ్యవహారం పైన న్యాయవాదులతో మంతనాలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి(President)ని కలిసారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసారని ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో లోకేశ్(Lokesh) తిరిగి తాను యువగళం యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ యాత్ర నిర్వహణకు వీలుగా తనకు సీఐడీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.

సీఐడీ అభియోగాలు: తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పాత్ర పైన సీఐడీ కీలక అంశాలను ప్రస్తావించింది. టీడీపీ(TDP) అసలు వేయని..కనిపించని రింగ్ రోడ్డు వ్యవహారంలో కేసు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, రింగ్ రోడ్డు పేరుతో స్కాం జరిగిందని..క్విడ్ ప్రో కో చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీలో ముఖ్యులు..లింగమనేని రమేష్ వంటి వారికి మేలు జరిగేలా రింగ్ రోడ్(amaravati Ring Road) అలైన్ మెంట్ లో మార్పులు చేసారనే అభియోగాలు నమోదయ్యాయి.

అయితే, లోకేశ్ (Lokesh)మాత్రం అసలు తనకు ఈ వ్యవహారంతో ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. తనను అరెస్ట్ చేసుకోవాలని భావిస్తే ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఏపీ అసెంబ్లీలో(AP Assembly)నూ అమరావతి రింగ్ రోడ్ అక్రమాల పైన చర్చ జరిగింది.

యువగళం తిరిగి ప్రారంభం వేళ: చంద్రబాబు అరెస్ట్ తరువాత నుంచి లోకేశ్(Lokesh) అరెస్ట్ ఖాయమంటూ నేరుగా మంత్రులే చెబుతూ వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తో లోకేశ్ తన యువగళం యాత్రను ఈ నెల 9వ తేదీన నిలుపుదల చేసారు. ఇక, ఇప్పుడు లోకేశ్(Lokesh) పైన కేసులు నమోదు అవుతున్న సమయంలో సీఐడీ అడుగుల పైన ఉత్కంఠ పెరుగుతోంది.

లోకేశ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలోనే నారా లోకేశ్ యువగళం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఎక్కడైతే లోకేశ్ యాత్ర నిలిచిందో తిరిగి అక్కడనుంచే శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు నారా లోకేశ్(Nara Lokesh) తిరిగి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్..అటు యాత్ర తిరిగి ప్రారంభం వేళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+