ఏపీ హైకోర్టుకు నారా లోకేష్

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Nara Lokesh files Lunch motion petition in AP High Court

అదే సమయంలో ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్‌లో కుంభకోణాన్ని సైతం తెర మీదికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయంలో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులను సైతం జారీ చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ నారా లోకేష్‌కు నోటీసులను అందజేశారు.

తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో పొందుపరిచిన నిబంధనలను తప్పుపట్టారు.

తాను డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న తీర్మానాలు, అకౌంట్ వివరాలను తమకు అందజేయాల్సి ఉంటుందంటూ సీఐడీ అధికారులు ఆదేశించడం సరికాదని పేర్కొన్నారు నారా లోకేష్. ఆయా విషయాలన్నింటితో కూడిన లంచ్ మోషన్ పిటీషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+