వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సీపట్నం పులి -పులివెందుల పిల్లి : జన జాతరతో భయం - లోకేష్ ఫైర్..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని ఎద్దేవా చేసారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతరతో వైసీపీ నేతల్లో భయం మొదలైందని పేర్కొన్నారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే సీఎం ఎంతగా భయపడ్డారో అర్దం అవుతోందంటూ వ్యాఖ్యానించారు.

పిరికిపంద చర్యలు

ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను పాల్పడుతోందంటూ దుయ్యబట్టారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆదివారం విధ్వంస దినంగా మార్చేసిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజల వాయిస్ వినిపిస్తున్న అయ్యన్న పైన సీఎం జగన్ కక్ష్య సాధింపుకు దిగుతున్నారంటూ ఆరోపించారు.

ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయి

ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయి

ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక ఈ చర్యలు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏపీ గూండారాజ్ గా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ దుయ్యబట్టారు. పోలీసులు సైతం అతిగా స్పందిస్తున్నారని విమర్శించారు. తన ప్రభుత్వ పునాదులు కదులుతుండటంతో సీఎం జగన్ టీడీపీ నేతలు ఇళ్లను కూలుస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభమైందన్నారు. ఈ రోజు జగన్ దే కావచ్చు.. రేపు తమదని హెచ్చరించారు.

చంద్రబాబు స్పందనతో భయం

చంద్రబాబు స్పందనతో భయం


టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకనే టీడీపీ నేతల పైన కక్ష్య సాధింపు చర్చలకు పాల్పడుతున్నారంటూ దుయ్యబట్టారు. నిలదీశారు. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారని.. ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. అయితే, ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలంలో ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని..ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. నర్సీపట్నంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
TDP General Secretary Nara Lokesh fires on CM JAgan and YSRCP leaders, He reacted on demolish of Ayyana house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X