ఆ స్టింగ్ ఆపరేషన్ వల్లే ధూళిపాళ్ళ అరెస్ట్ .. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి జగన్ రాక్షసానందం : లోకేష్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ పై టిడిపి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్ష నేతల పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ధూళిపాళ్ళ అరెస్ట్ : లోకేష్

గుంటూరు జిల్లా చింతలపూడి లోని ఆయన నివాసం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేశారు . సంగం డైరీ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపధ్యంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారీగా మోహరించిన పోలీసుల మధ్య ధూళిపాళ్ళ నరేంద్రను అరెస్ట్ చేశారు . అయితే ఇదంతా ప్రతిపక్ష నేతల పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో జగన్ రాక్షసానందం : లోకేష్ ఫైర్


ట్విట్టర్ వేదికగా మండిపడిన లోకేష్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు వైయస్ జగన్ అంటూ, జగన్ ను టార్గెట్ చేశారు.

ధూళిపాళ్ళ కుటుంబం నలుగురికి సహాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం, మీలాంటి దోపిడి కుటుంబం కాదని లోకేష్ జగన్ పై మండిపడ్డారు . సంగం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచింది దూళిపాళ్ల కుటుంబమని, ప్రభుత్వ అసమర్థతను, దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై కక్ష కట్టారని లోకేష్ విమర్శించారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ డ్రామాపై స్టింగ్ ఆపరేషన్ చేసినందుకే కక్ష

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఓ డ్రామాను స్టింగ్ ఆపరేషన్తో ,ఆధారాలతో సహా బట్టబయలు చేసి జగన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలు అంటూ నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐదు సార్లు వరుసగా శాసనసభ్యుడిగా గెలిచిన ఆయనది రికార్డు అని పేర్కొన్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు నారా లోకేష్ .

చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికీ విజయం సాధించలేదు

అక్రమ కేసులు బనాయించి ధూళిపాళ్ళ నరేంద్ర ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న లోకేష్ చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికీ విజయం సాధించలేదని ఫైర్ అయ్యారు.
ఇక టీడీపీ నేతలు ధూళిపాళ్ళ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు. అమూల్ కోసమే సంగం డైరీని నాశనం చెయ్యాలని చూస్తున్నారని మండిపడుతున్నారు . ప్రశ్నించే గొంతులను , ప్రతిపక్ష నేతలను తొక్కి పెట్టటం ద్వారా , కేసులు పెట్టటం ద్వారా జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడుతున్నారు . ధూళిపాళ్ళ నరేంద్ర ను తక్షణం విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+