పోలీసుల అదుపులో లోకేశ్-నర్సరావుపేటకు నో పర్మిషన్ : టీడీపీ నేతల హౌస్ అరెస్ట్-టెన్షన్..!!

విజయవాడ: టీడీపీ యువ నేత..పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, లోకేశ్ కు నర్సరావుపేట వెళ్లేందుకు అనుమతి లేదంటూ విమానశ్రయం వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ నందివాడ పోలీసు స్టేషన్ ను తరలిస్తున్నట్లుగా సమాచారం.

లోకేశ్ అదుపులోకి...పర్యటనకు నో

లోకేశ్ అదుపులోకి...పర్యటనకు నో

అయితే, లోకేశ్ తనను అడ్డుకోవటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. తన పర్యటన పైన అభ్యంతరం ఉంటే తనను పార్టీ కార్యాలయానికి లేదా నివాసానికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంటూ పోలీసులను కోరారు. అయితే, పోలీసులు లోకేశ్ ను గుడివాడ వైపు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమా ను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ నుంచి లోకేశ్ ను అనూష పుట్టినరోజును అమె గృహంలో లేదా స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్..

టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్..

ఈ క్రమంలో లోకేశ్‌ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం టీడీపీ నేతలు దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు. లోకేశ్ పర్యటన పైన టీడీపీ- వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇదే మయంలో పోలీసు అధికారులు సైతం లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు మందుగానే హౌస్ అరెస్ట్ చేసారు.

నర్సరావుపేటలో టెన్షన్

నర్సరావుపేటలో టెన్షన్

దివంగత స్పీకర్ కోడెల కుమారుడు శివరామ్ తో పాటుగా నర్సరావు పేట టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్‌ అరవిందబాబు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులకు అండగా లోకేశ్‌ ఆందోళన చేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. లోకేశ్‌ నరసరావుపేటకు వస్తారని, అనూష కుటుంబాన్ని పరామర్శిస్తారని జీవీ అంజనేయులు తెలిపారు.

రాజకీయం చేస్తామంటే అనుమతి లేదంటూ..

రాజకీయం చేస్తామంటే అనుమతి లేదంటూ..

మరోవైపు పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నేతలకు లోకేశ్‌ పర్యటనకు అనుమతి లేదని, పాల్గొనడానికి రావద్దని పోలీసులు సందేశాలు పంపారు. నరసరావుపేటలో లోకేశ్‌ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. మహిళలపై జరిగే నేరాలను రాజకీయం చేయవద్దని సూచించారు. రమ్య కేసు విషయంలోనూ ఇదేవిధంగా రాజకీయం చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+