మాట తప్పడు..మడమ తిప్పడు.. నారా లోకేష్.. ఇదే నిదర్శనం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు యువ గళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి యువ గళం పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేసిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్, అప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

మరో హామీ నెరవేర్చిన నారా లోకేష్
అంతేకాదు వారికి ఆ సమస్యలను పరిష్కరిస్తానని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం నారా లోకేష్ మరొక హామీని నెరవేర్చారు. కర్నూలులోని అశోక్ నగర్ నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 150 మంది గూడెం కొట్టాల నిరుపేదలకు శాశ్వత గృహ పట్టాలను పంపిణీ చేయించారు నారా లోకేష్.

nara lokesh kept his promise to the poor in the Gudem Kottala area in kurnool

శాశ్వత గృహ పట్టాల కోసం యువగళం యాత్రలో లోకేష్ ను కలిసిన పేదలు
గూడెం కొట్టాల ప్రాంతంలో చాలాకాలంగా నిరుపేద ప్రజలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. ఈ ప్రజలు శాశ్వత పట్టాల కోసం చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందరిని అభ్యర్థిస్తున్నా, వీళ్ళ గోడును పట్టించుకున్న నాధుడే లేడు. ఈ క్రమంలో యువ గళం పాదయాత్రలో భాగంగా కర్నూలుకు వచ్చిన నారా లోకేష్ ను అప్పటి కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాల వాసులు కలిశారు.

శాశ్వత పట్టాల మంజూరుకు విజ్ఞప్తి
వారు తమకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని లోకేష్ కు తమ గోడును విన్నవించుకున్నారు. దీనికి అప్పుడు స్పందించిన లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వారి సమస్య పరిష్కరిస్తామని, శాశ్వత పట్టాలను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 30ని జారీ చేశారు.

150 మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ
ఈ జీవో ద్వారా కోట్లాది రూపాయల విలువైన ఎకరం స్థలాన్ని నిరుపేదలకు కేటాయించారు. ప్రస్తుతం మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా 150 మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. దీంతో నారా లోకేష్ తాను ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+