వాళ్లకు గ్యారంటీ లేదు - టికెట్ల ఖరారుపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
మహానాడు సమయంలో టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. టికెట్లు ఖాయమని భావిస్తున్న వారికి షాక్ ఇచ్చారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లు తమ సామ్రాజ్యం..నా అడ్డాలోకి ఎవరూ రాకూడదంటే కుదరదని తేల్చేసారు. గతంలో పార్టీని వీడి తిరిగి వద్దామని భావించే వారికి డోర్స్ తెరుచుకోవని క్లారిటీ ఇచ్చారు. కొందరికి వచ్చే ఎన్నికల్లో..మరి కొందరికి 2029 లో అవకాశం దక్కవచ్చంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతున్నాయి.
లోకేష్ క్లారిటీ : వచ్చే అభ్యర్దులకు తాను అభ్యర్ధులను ప్రకటించటం లేదని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. పాదయాత్రలో చేయి ఎత్తించిన నాయకులకు టికెట్ ఖరారైనట్లు ప్రచారం సరికాదన్నారు. తనతో సహా ఎవరైనా పని చేయకపోతే టికెట్ దక్కదని చెప్పారు. టికెట్ ఖరారు చేసేది పార్టీ అధినేతేనని స్పష్టం చేసారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలో కొన్ని కీలక నియోజకవర్గాలకు లోకేష్ అభ్యర్ధులకు ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగింది. ఇప్పుడు వారికి టికెట్లు ప్రకటించనట్లు కాదని లోకేష్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఖచ్చితంగా నెరవేర్చగలమన్న ధీమా ఉన్న హామీలనే పాదయాత్రలో తాను ఇస్తున్నానని లోకేష్ తెలిపారు. తన భుజానికి గాయం అయిందని..నెల రోజులు ఒత్తిడి లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడించారు.

బి-ఫారం వరకూ గ్యారంటీ లేదు : టికెట్ వచ్చిందని ఇంట్లో కూర్చుంటే కుదరదని, బి-ఫారం వచ్చే వరకూ ఎవరికీ గ్యారంటీ లేదని లోకేష్ స్పష్టం చేసారు. పని చేయకుండా, తిరగకుండా ఇంట్లో కూర్చుని మా మాన్న ఇంది, మా తాత ఇది అని కబుర్లు చెబితే తనతో సహా ఎవరికీ టికెట్ రాదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులపై పార్టీ అధినేత దశలవారీగా స్పష్టత ఇస్తారని చెప్పుకొచ్చారు. పార్టీ తరపున ఎవరు కార్యక్రమాలు చేస్తామని చెప్పినా ఆహ్వానిస్తున్నామన్నారు. ఇంఛార్జ్ లు తమ నియోజకవర్గాల్లో ఎవరూ రాకుడదంటే కుదరదన్నారు. వచ్చే 15 నుంచి 30 ఏళ్ల కాలానికి పార్టీలో నాయకత్వాన్ని సిద్దం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొందరికి వచ్చే ఎన్నికల్లో, మరి కొందరికి 2029లో టికెట్లు దక్కే అవకాశం ఉంటుందన్నారు. పని చేయకపోతే ఎప్పటికీ దక్కదన్నారు.
వారిని ఎలా కాదంటాం : పార్టీ కోసం పని చేస్తామని ఎవరైనా ముందుకొస్తే ఎలా కాదంటామని లోకేష్ ప్రశ్నించారు. రాయలసీమలో యువగళం పాదయాత్ర చివరి రోజున సీమ డెవపల్ మెంట్ కు సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని లోకేష్ చెప్పారు. రాయలసీమ ప్రజలు టీడీపీ వైపే ఉన్నారనే విషయం పాదయాత్రలో స్పష్టమైందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి మహానాడు వేదిక పై నుంచి చంద్రబాబు ఈ రోజు ప్రకటన చేస్తారని లోకేష్ వెల్లడించారు. నిరుద్యోగ సమస్య తొలిగిపోవాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయాలన్నారు.. ప్రయివేటు పెట్టుబడులు రావాలన్నారు. వైసీపీ హయాంలో ప్రైవేటు పెట్టుబడులు ఆగిపోయాయని ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టికెట్ల ఖరారుపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీ ఇంఛార్జ్ ల్లో టెన్షన్ కు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications