అమెరికా టుర్ జాబితా నుంచి నారా లోకేష్ ఔట్: 2 కారణాలు, ఆ భయంతోనేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల ఈ నెలలో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన వెంట మంత్రుల బృందం కూడా అయితే అమెరికాకు వెళ్లే మంత్రుల బృందం జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ జాబితాలో మంత్రి నారా లోకేష్ పేరును తొలగించారు. లోకేష్ పేరు మినహాయించి పదిహేను మంది సభ్యుల బృందం అమెరికా వెళ్లనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేశారు.

బాబుకు మరో తలనొప్పి: రాయపాటి కొత్త ట్విస్ట్, మురళీ మోహన్ ఒత్తిడి?

Nara Lokesh name removed from America tour list

అంతకుముందు, గత నెల 28వ తేదీ జీవోలో మంత్రులు యనమల, లోకేష్‌తో పాటు 17 మంది అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. తాజా జీవోలో లోకేష్, సీఎం పీఎస్ శ్రీనివాస రావు పేర్లను తొలగించారు.

వారం పాటు సీఎంతో పాటు లోకేష్ కూడా అమెరికా పర్యటనలో ఉంటే రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు ఎవరు చూస్తారనే భావనలో ఈ పర్యనటకు లోకేష్, సీఎం పీఎస్ శ్రీనివాస రావు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

అదే సమయంలో, అమెరికా పర్యటనలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలతో లోకేష్ ఒప్పందాలు చేసుకుంటారని ప్రచారం జరిగింది. తీరా అమెరికా పర్యటనలో ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగకుంటే లోకేష్ పరువు పోతుందనే, తొలిసారి మంత్రి అయిన లోకేష్‌కు రాజకీయంగా ఇది సరి కాదనే ఉద్దేశ్యంతోను వెనక్కి తగ్గారని వ్యతిరేక వర్గాలు అంటున్నాయి.

ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు చంద్రబాబుతో పాటు మంత్రుల బృందం అమెరికాలో పర్యటించనుంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా తదితర నగరాల్లో పర్యటించి అధికారులతో చర్చలు జరుపుతారు.

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో రాష్ట్రంలో వివిధ పోస్టుల స్థాయి పెంపు, కొత్తగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader and Minister Nara Lokesh name removed from America tour list.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి