ముందస్తు ఎన్నికలకు వెళ్లం, రాష్ట్రంలో ఎక్కడ్నుంచైనా పోటీ చేస్తా: లోకేష్
అమరావతి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు తీర్పు ఇచ్చారని లోకేష్ తెలిపారు.
Recommended Video

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే లోపల వేస్తామని మంత్రి హెచ్చరించారు. సైబర్ చట్టం ప్రకారం వ్యవహరిస్తామన్నారు.

తనపై అవినీతి ఆరోపణలు చేసే వారు ఆధారాలతో రుజువు చేయాలని సవాల్ లోకేష్ విసిరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దన్నారు. ఐటీ రంగంలో 2లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
వైయస్ హయాంలో కుప్పానికి మీటర్ రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం పులివెందులకు రోడ్డు వేసినట్లు తెలిపారు. వచ్చే కేబినెట్‌లో నిరుద్యోగ భృతిపై తుది రూపం ఇస్తామని వెల్లడించారు. అలాగే విధివిధానాలు కూడా ప్రకటిస్తామని లోకేశ్ వివరించారు.












Click it and Unblock the Notifications