'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై లోకేష్ ఇలా: లక్ష్మీపార్వతి హీరోయిన్, ఐతే మీరే హీరో: సోమిరెడ్డికి వర్మ కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu
లక్ష్మీస్ ఎన్టీఆర్'పై లోకేష్ ఇలా: లక్ష్మీపార్వతి హీరోయిన్ ఐతే హీరో మీరే | Oneindia Telugu

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై మాటల యుద్ధం నడుస్తోంది. వర్మ పైన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. దానికి ఆయన కూడా కౌంటర్ ఇస్తున్నారు.

ఒకే కోణమా?: పురంధేశ్వరి ఆగ్రహం, వర్మ కౌంటర్, సినిమాను ఎవరైనా ఆపగలరా?

అప్పటి నుంచి అందుకే వివాదం

అప్పటి నుంచి అందుకే వివాదం

వర్మ సినిమా తీస్తానని ప్రకటించినప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది. ఎన్టీఆర్ బయోగ్రఫీ తీస్తానని చెప్పినప్పుడు బాగానే ఉంది. కానీ లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి చనిపోయే వరకు సినిమా తీస్తానని ప్రకటించడం, దానికి వైసిపి నేత నిర్మాత కావడం వివాదానికి దారి తీసింది.

 లక్ష్మీపార్వతి, పురంధేశ్వరిల స్పందన

లక్ష్మీపార్వతి, పురంధేశ్వరిల స్పందన

వర్మ సినిమాపై పురంధేశ్వరి, లక్ష్మీపార్వతిలు కూడా స్పందించారు. ఎన్టీఆర్ జీవితంలో ఒక యాంగిల్ తీసుకొని సినిమా సరికాదని పురంధేశ్వరి అన్నారు. వర్మ సినిమాను వైసిపి నేత తీస్తున్నారని, ఆయన వెనుక జగన్ ఉన్నారనే ప్రచారం సాగింది. దానిపై లక్ష్మీపార్వతి స్పందించారు. జగన్ అలా చేయడం లేదని అభిప్రాయపడ్డారు.

 సినిమా తీయనీయండి, మాట్లాడటానికి ఏముంది?

సినిమా తీయనీయండి, మాట్లాడటానికి ఏముంది?

తాజాగా, బుధవారం మంత్రి నారా లోకేష్‌ను మీడియా ప్రతినిధులు ఈ సినిమా గురించి అడిగారు. దానికి లోకేష్ స్పందించారు. వర్మ సినిమాపై తాను ప్రత్యేకంగా కామెంట్ చేయదల్చుకోలేదని చెప్పారు. ఆయన సినిమా తీస్తే తీయనీయండి అని, అది సినిమా మాత్రమేనని, అందులో మాట్లాడటానికి ఏముంటుందని లోకేష్ అన్నారు.

సినిమా తీయడం సంతోషం.. సోమిరెడ్డి

సినిమా తీయడం సంతోషం.. సోమిరెడ్డి

పనీపాటలేని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. వర్మ ఎప్పుడూ వివాదాల్లో ఉంటారని, తీసిన సినిమాలు హిట్టయ్యేలా చూసుకోవాలని హితవు పలికారు. లక్ష్మీ`స్ ఎన్టీఆర్ అనే సినిమా తీయడం సంతోషకరమని ఎద్దేవా చేశారు.

 హీరోయిన్‌గా లక్ష్మీపార్వతిని పెట్టండి: వర్మపై సోమిరెడ్డి ఆగ్రహం

హీరోయిన్‌గా లక్ష్మీపార్వతిని పెట్టండి: వర్మపై సోమిరెడ్డి ఆగ్రహం

త్యాగశీలి లక్ష్మీపార్వతి సినిమాలో హీరోయిన్‌గా ఆమెనే (లక్ష్మీపార్వతి) పెట్టుకోమనండి అని సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వర్మ సినిమాలో లక్ష్మీపార్వతినే హీరోయిన్‌గా పెట్టుకోవాలని చెప్పడంపై వర్మ కూడా వెంటనే స్పందించారు.

 సోమిరెడ్డీ! హీరోగా మిమ్మల్నే పెట్టుకుంటా

సోమిరెడ్డీ! హీరోగా మిమ్మల్నే పెట్టుకుంటా

తనకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సలహా ఇవ్వడంపై రామ్ గోపాల్ వర్మ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు అని, మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటానని వర్మ చెప్పారు. కాగా, రోజా, ప్రకాశ్ రాజ్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP IT Minister Nara Lokesh responded on director Ram Gopal Varma's Laxmi's NTR film. TDP leader Somireddy Chandramohan Reddy lashed out at RGV for film.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి