జప్ఫాలు... This is వాస్తవం.. ఆ పాపం వూరికే పోదు : నారా లోకేష్
మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . నారావారి పల్లెలో జరిగిన బహిరంగ సభకు ఎవరూ రాలేదని పేర్కొన్నారు. జనం మాత్రం కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ కొన్ని వీడియోలతో పాటు, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఈ క్రమంలోనే ఆ సభకు సంబంధించిన విజువల్స్ , ఫోటోలు పోస్టు చేశారు నారా లోకేష్. ఇక అంతే కాదు 'జప్ఫాలు... This is వాస్తవం' అంటూ కాస్త వెటకారం కూడా జోడించి వైసీపీపై విమర్శలు గుప్పించారు నారా లోకేష్ .
మూడు రాజధానులపై చంద్రబాబు ఇలాకాలో వైసీపీ భారీ బహిరంగ సభను నిర్వహించి సక్సెస్ అయ్యామని చెప్తుంటే అధికార పార్టీకి అంత సీన్ లేదు ఆ సభకు జనమే రాలేదని టీడీపీ ఎద్దేవా చేస్తుంది. సభకు జనాలే రాలేదని, కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయని సభ విఫలం అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇక అంతేకాదు ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే.. ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. చివరకు అవ్వా, తాతలను కూడా వదలలేదని, పండు టాకులకు పెన్షన్ తీసేసిన పాపం ఊరికే పోదంటూ జగన్ పై మండిపడిన లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు ఓ వీడియోను కూడా జతపరిచారు. పెన్షనే తనకు ఆధారం అని, అది లేకుండా చేశారంటూ ఓ వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ను లోకేష్ పోస్ట్ చేశారు .
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications