లోకేశ్ బైఠాయింపు, తండ్రిని చూడనీయరా - ముందస్తు అరెస్ట్ లు, అలర్ట్..!!
చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తన తండ్రి అరెస్ట్ గురించి తెలిసిన వెంటనే నంద్యాల వెళ్లేందుకు లోకేశ్ సిద్దమయ్యారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో, లోకేశ్ అక్కడే యువగళం యాత్ర వద్ద బైఠాయించారు. పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తన తండ్రిని చూడటానికి వెళ్లద్దా అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.
ఏపీలో ఒక్కసారిగా రాజకీయ కలకలం మొదలైంది. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు తనను రేపో, మాపో అరెస్ట్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ తెల్లవారు జామున నంద్యాలలో బస చేసి ఉన్న క్యాంపు వద్దకు పోలీసు అధికారులు చేరుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసారు. ఆ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది.

తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని అధికారులను నిలదీసారు. ఆ తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి.. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబును అధికారులు విజయవాడ తరలించారు. ఇదే సమయంలో నాడు చంద్రబాబు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన గంటాతో సహా ఆయన కుమారుడిని అరెస్ట్ చేసారు.
చంద్రబాబు అరెస్ట్ తెలిసిన వెంటనే ఆయన కుమారుడు లోకేశ్ నంద్యాలకు బయల్దేరేందుకు ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పొదలాడ యువగళం క్యాంపు నుంచి బయల్దేనేందుకు ప్రయత్నించిన లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల తీరు పైన లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. తండ్రిని చూడటానికి కూడా వెళ్లనీయరా అంటూ సీరియస్ అయ్యారు. ఇటు, రాష్త్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేసారు.
తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారాలోకేష్ ను అడ్డుకున్న పోలీసులు#NaraLokesh #Chandrababu #TDP #ChandrababuArrest #ApPolice #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/mK6aKDzD8C
— oneindiatelugu (@oneindiatelugu) September 9, 2023
అటు నంద్యాలలో వైద్య పరీక్షల తరువాత చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ఎక్కడా మచ్చ లేదని టీడీపీ నేత కేశినేని చిన్ని పేర్కొన్నారు. అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాం టీడీపీ నేత కేశినేని చిన్ని#KesineniChinni #Chandrababu #CBN #TDP #ChandrababuArrest #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/rHjTo9zpe9
— oneindiatelugu (@oneindiatelugu) September 9, 2023
సెలవు రోజుల్లో అక్రమంగా అరెస్ట్ చేసారని ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. అటు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబుకు ఏం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ కళ్లల్లో ఆనందం కోసమే సంబంధం లేని తమను అరెస్ట్ చేసారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications