హైదరాబాద్ నుంచి విశాఖకు టెక్కీలు, 45 రోజులుకీలకం: లోకేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: హైదరాబాద్ నుంచి చాలామంది సాఫ్టువేర్ ఇంజినీర్లు విశాఖకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంగళవారం అన్నారు.

వైయస్ bw జగన్‌కు నరేంద్ర మోడీ దెబ్బ!

తొలిసారి మంత్రి హోదాలో..

తొలిసారి మంత్రి హోదాలో..

జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమయింది. మంత్రి హోదాలో తొలిసారి సభకు వచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చేందుకు చాలామంది టెక్కీలు సిద్ధంగా ఉన్నారన్నారు.

15వేల ఉద్యోగాలు

15వేల ఉద్యోగాలు

హెచ్‌సిఎల్‌తో ఒప్పందంతో రాష్ట్రానికి పదిహేను వేల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ చెప్పారు. ఐటీ కంపెనీలు ఎక్కువగా విశాఖ వైపే మొగ్గు చూపుతున్నాయని తెలిపారు.

45 రోజులు కీలకం

45 రోజులు కీలకం

రాబోయే 45 రోజులు తనకు చాలా కీలకమని లోకేష్ అన్నారు. ప్రస్తుతం పార్టీ పనులు అన్నీ చంద్రబాబు చూస్తున్నారని తెలిపారు. మరో 120 రోజుల తర్వాత పార్టీ పనులపై దృష్టిపెడతానన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని, శాఖలపై పట్టు సాధించేందుకు 120 రోజుల సమయం కోరానన్నారు.

జగన్‌కు కౌంటర్

జగన్‌కు కౌంటర్

అంతకుముందు లోకేష్ ప్రతిపక్ష నేత జగన్‌పై నిప్పులు చెరిగారు. శాసనసభను స్తంభింపజేస్తామన్న ఆయన వ్యాఖ్యలను తప్పబట్టారు. జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించింది ఒకటైతే ప్రజలకు చెప్పింది మరొకటని విమర్శించారు.

జగన్ మరిచిపోయారేమోనని..

జగన్ మరిచిపోయారేమోనని..

రైతుల సమస్యలను తీరుస్తున్నందుకు జగన్ శాసనసభను స్తంభింపజేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లోనూ మిర్చి, పసుపు రైతులకు అంతంత మాత్రంగా చెల్లిస్తుంటే, ఏపీలో మిర్చి, పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని జగన్ మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Minister Nara Lokesh on Tuesday said that Hyderabad techies ready to come Vishaka
Please Wait while comments are loading...