'అందుకే టీఆర్ఎస్ మాటలు ఏపీ ప్రజలు నమ్మరు, కాంగ్రెస్-టీడీపీ వేరుగా పోటీ చేసి.. కలుస్తాయా?'
అమరావతి/దావోస్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. దావోస్‌లో ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలవి కుమ్మక్కు రాజకీయాలని ఆయన విమర్శించారు. వారి మాటలు ప్రజలు నమ్మరని చెప్పారు.

అందుకే టీఆర్ఎస్ మాటలు ఏపీ ప్రజలు నమ్మరు
ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ సహకరించలేదని, కానీ తన ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై పల్లెత్తు మాట అనలేదని లోకేష్ అన్నారు. ఏపీకి సహకరించని టీఆర్ఎస్ మాటలను ఏపీ ప్రజలు ఏమాత్రం విశ్వసించరని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు, కేసీఆర్‌తో కలిసి జగన్ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించారని చెప్పారు. విభజన తర్వాత ఏపీకి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.

బీజేపీని ఓడించడమే లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని లోకేష్ చెప్పారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పారు. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు చంద్రబాబు సేవలు ఎంతో అవసరమని చెప్పారు. ఆయన ప్రధానిగా వెళ్లాలని కోరుకోవడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు కూడా కుట్ర పన్నారని ఆరోపించారు.

టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేసి కేంద్రంలో కలుస్తాయా అంటే?
పార్లమెంటు సీట్లకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి.. విపక్షాలు గెలిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కలిసి పని చేస్తాయా అనే అంశంపై ఇప్పుడే మాట్లాడలేమని నారా లోకేష్ స్పష్టం చేశారు. దానిపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications