బెంగళూరు-విజయవాడ వందే భారత్..! కేశినేనికి లోకేష్ బిగ్ టాస్క్..!

ఏపీలోని విజయవాడ (Vijayawada)నుంచి బెంగళూరు (Bengaluru)కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ (vande bharat express)రైలు నడపాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా విజయవాడ నుంచి బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులతో పాటు కోస్తాజిల్లాలకూ, కర్నాటకకూ వేగవంతమైన కనెక్టివిటీ కోసం ఈ వందే భారత్ తప్పనిసరి అన్న చర్చ జరుగుతోంది. కానీ ఈ మార్గంలో రద్దీ,ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఎప్పటికప్పుడు దీన్ని వాయిదా వేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు.

తాజాగా ఎక్స్ లో ఓయూజర్ బెంగళూరు-విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఎందుకు అవసరమో వివరిస్తూ మంత్రి నారా లోకేష్ కు ట్వీట్ చేశారు. ఇందులోఆయన .. బెంగళూరులో పనిచేస్తున్న కోస్తాంధ్రకు చెందిన వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ విజయవాడకు తగినంత రైళ్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. వారాంతాల్లో & పండుగలలో కన్ ఫమ్డ్ టిక్కెట్లు పొందడం చాలా కష్టమన్నారు.

Nara Lokesh Seeks MP Kesineni Chinni s Help on Bengaluru-Vijayawada Vande Bharat Demand

బెంగళూరు నుండి విజయవాడకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తక్షణమే నడపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వే మంత్రితో ఈ విషయాన్ని చర్చించాలని నారా లోకేష్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ వాస్తవ ప్రజా డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేష్.. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమని, దీనికి తగిన పరిష్కారం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ డిమాండ్ ను తీసుకెళ్తామన్నారు. అక్కడితో ఆగకుండా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని ఈ విషయంలో రైల్వేశాఖతో చర్చించి పరిష్కరించాలని లోకేష్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+