వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని - వంశీ : సడన్ ఎంట్రీ - ఏం జరిగింది..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. వారి ఎంట్రీతో ఒక్క సారిగా టీడీపీ నేతలు విస్తుపోయారు. వారు స్క్రీన్ మద కనిపిచటంతో వెంటనే టీడీపీ శ్రేణులు అప్రమత్తమయ్యారు. పదో తరగతి ఫలితాల పైన రిజల్స్ వచ్చిన సమయం నుంచి టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ పాస్ పర్సంటేజ్ ఇంత తక్కువగా లేదంటూ ప్రభుత్వ తీరు పైన విమర్శలు గుప్పించారు. పదో తరగతి ఫలితాల పైన విద్యార్ధులు..వారి తల్లి తండ్రులతో టీడీపీ నేత లోకేష్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసారు.

కొడాలి నాని -వంశీ సడన్ ఎంట్రీతో

కొడాలి నాని -వంశీ సడన్ ఎంట్రీతో

ముందుగానే దీనికి సంబంధించి ఐడీ.. పాస్ వర్డులు అందించారు. ఇక, కార్యక్రమం ప్రారంభమై విద్యార్ధులతో మాట్లాడుతున్న సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్క్రీన్ మీదకు వచ్చారు. దీంతో.. ఒక్క సారిగా టీడీపీ శ్రేణులు షాక్ అయ్యారు. వారు అసలు ఎలా మీటింగ్ లో జాయిన్ అయ్యారంటూ వెంటనే లైన్ కట్ చేసారు. ఓ విద్యార్ధిని వంశీ ఆఫీసులో ఉండి లాగిన్ అయినట్లుగా గుర్తించారు. వైసీపీ నేతలు ఈ మీటింగ్ లో లోకేష్ తో మాట్లాడే ప్రయత్నం చేసారు.

లోకేష్ వర్సెస్ వైసీపీ నేత

లోకేష్ వర్సెస్ వైసీపీ నేత

స్టూడెంట్స్ పేరుతో వైసీపీ నేతలు రావడంతో లోకేశ్ ఫైర్ అయ్యారు. అంతకుముందే వైసీపీ నేత దేవేందర్ రెడ్డి లైన్ లోకి వచ్చి లోకేష్ తో విద్యార్ధుల పేరుతో రాజకీయం చేయటం ఏంటంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నారాయణ విద్యా సంస్థల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలంటూ సూచించారు. లోకేష్ నిర్వహిస్తున్న సమావేశంలో పదో తరగతి విద్యార్ధులే లేరని.. ఇదంతా రాజకీయంగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఆర్గనైజ్డ్ కార్యక్రమంగా విమర్శించారు.

వైసీపీ నేతల ఎంట్రీ.. లైన్ కట్

వైసీపీ నేతల ఎంట్రీ.. లైన్ కట్

ముందు రాసుకొచ్చిన స్క్రిప్టుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, వైసీపీ నేతలు రావటం తో స్పందించిన లోకేష్.. ఇది ఈ ఏడాది ఫెయిల్ అయ్యిన వాళ్ళకే ఎప్పుడో పది, పద్దతి తప్పిన వైసిపి వాళ్లకు కాదు అంటూ వ్యాఖ్యానించారు. కొడాలి నాని..వంశీ ఎంటర్ అవ్వటం పైన రియాక్ట్ అవుతూ..జూమ్ లో కాదు నేరుగానే మాట్లాడుతానని లోకేష్ చెప్పారు. జగన్ రివర్స్ పాలనలో పదో తరగతిలో రివర్స్ ఫలితాలు వచ్చాయన్నారు. వారందరికీ ..రీ వాల్యుయేషన్.. రీ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేసారు.

English summary
TDP leader was surprised to see YSRCP leaders Kodali Nani and Vallabhaneni Vamsi in his zoom meeting with 10th class students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X