రాష్ట్ర పరువును ఎంత దిగజార్చారో చూడండి! జగన్ పాలన విధ్వంసంపై లోకేష్ ఛార్జీషీటు

హైదరాబాద్: ఏపీ సీఎం, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు ప్రజలకు మేలు చేసేందుకు పథకాలు తెస్తే.. జగన్ మాత్రం స్కాముల కోసమే తెస్తున్నారని ఆరోపించారు.

విధ్వంసానికి ఒక్కఛాన్స్..

విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ పాలనపై ఛార్జ్ షీట్‌ను లోకేష్ విడుదల చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడాది అయ్యిందని ధ్వజమెత్తారు. పాదయాత్రలో హామీలు ఇస్తూ పోయిన జగన్.. ఇప్పుడు షరతులు వర్తిస్తాయంటున్నారని మండిపడ్డారు.

దేశంలో పెద్ద కుంభకోణాలు జగన్ పాలనలోనే..

దేశంలో పెద్ద కుంభకోణాలు జగన్ పాలనలోనే..

కరోనాను అక్రమార్జనకు అనుకూలంగా మలచుకున్నారని మండిపడ్డారు. ఉన్న పథకాలు అమలు చేస్తూ మేనిఫెస్టోలో అమలు చేయడం ప్రభుత్వాలకు అలవాటని, కానీ జగన్ దీనికి విరుద్ధమని ఎద్దేవా చేశారు. దేశంలో పెద్ద భూ కుంభకోణాలు జగన్ పాలనలోనే జరుగుతున్నాయన్నారు.

Recommended Video

    TDP State President Post : Kinjarapu Rammohan Naidu Given Clarification
    అప్పుడు ఆప్యాయత.. ఇప్పుడు పిడిగుద్దులు..

    అప్పుడు ఆప్యాయత.. ఇప్పుడు పిడిగుద్దులు..

    సీఎం జగన్.. అమ్మ ఒడి పథకాన్ని అర్థఒడిని చేశారంటూ లోకేష్ విమర్శించారు. పాదయాత్రలో ఆప్యాయతను చూపి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. ఏడాది కాలంలో 565 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను రోడ్డుపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలే ఇసుక తింటూ దొరకట్లేదని గగ్గోలు పెడుతున్నారని లోకేష్ దుయ్యబట్టారు. విద్యుత్ బిల్లులు చూస్తేనే షాక్‌ కొడుతోందని, విద్యుత్ కొనుగోళ్లలో వేలాది కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

    రాష్ట్ర పరువును ఎంత దిగజార్చారో చూడండి..

    ‘జగన్ గారి ఏడాది పాలన విధ్వంసాన్ని గురించి ఇప్పుడు వైసీపీ నేతలే రోజుకొకరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అధికార పార్టీ నేతలే ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్నప్పుడు, అధికారమిచ్చి బాధలు అనుభవిస్తున్న ప్రజలు ఇంకెంతగా ప్రశ్నించాలి! ఆలోచించండి! గారు ఏడాది కాలంలో రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టించారో, ప్రజలని ఎంత మోసం చేసారో, అభివృద్ధిని ఎలా నాశనం చేసారో, రాష్ట్ర పరువును ఎంతలా దిగజార్చారో ... ఈ వీడియో చక్కగా వివరించింది' అని లోకేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+