• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రన్‌వే పైనే లోకేష్‌కు స్వాగతం, ఎన్టీఆర్ ఇలా(పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్ డల్లాస్‌లో పర్యటించారు.

ఏపీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్నారైల కోసం ప్రభుత్వం త్వరలోనే ప్రవాసాంధ్ర తెలుగు పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తుందని లోకేష్ చెప్పారు.

ప్రపంచంలో ఉన్న ఎన్నారైలంతా ఇందులో సభ్యత్వం స్వీకరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

నాటికి దేశంలో మూడు ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, నాటికి ఆగ్నేయాసియాలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీని చూడాలనే సంకల్పంతో పని చేస్తున్నామన్నారు.

 నారా లోకేష్

నారా లోకేష్

జన్మభూమి వల్ల కొన్ని అభివృద్ధి పనులు జరిగాయన్నరు. గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, అందుకోసం అందరు భాగస్వాములు కావాలన్నారు.

 నారా లోకేష్

నారా లోకేష్

కాంత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శశికాంత్ వల్లేపల్లి.. నారా లోకేష్‌ను కలిసి కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని చెప్పారు.

 నారా లోకేష్

నారా లోకేష్

బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో క్యాంపులు నిర్వహిస్తామన్నారు. అందుకు సంబంధించిన వ్యయాన్ని భరిస్తామన్నారు.

 నారా లోకేష్

నారా లోకేష్

మరికొందరు మాట్లాడుతూ.. ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరిని అంబాసిడర్‌గా నియమించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

 నారా లోకేష్

నారా లోకేష్

కాగా, నారా లోకష్‌కు వాషింగ్టన్ డీసీలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం రన్ వే పైనే లోకేష్‌కు పార్టీ అభిమానులు స్వాగతం పలికారు.

 నారా లోకేష్

నారా లోకేష్

లోకేష్ వారిని చూసి ఉత్సాహంగా మాట్లాడారు. ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ప్రారంభించినట్లు వారికి తెలిపారు.

నారా లోకేష్

నారా లోకేష్

రాష్ర్టాభివృద్ధి గ్రామస్థాయి నుంచి జరగాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డుల కార్యక్రమాన్ని చేపట్టిందని నారా లోకేష్‌ ఈ సందర్భంగా అన్నారు.

 నారా లోకేష్

నారా లోకేష్

అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్‌ సోమవారం నాడు వాషింగ్టన్‌ డీసీలో పర్యటించారు. ఈ సందర్భంగా తానా కార్యదర్శి సతీష్‌ వేమన నేతృత్వంలో ఎన్నారై టీడీపీ శ్రేణులు లోకేష్‌కు ఘనస్వాగతం పలికాయి.

 నారా లోకేష్

నారా లోకేష్

అనంతరం హయత్‌ డల్లాస్‌లో ఎన్నారైలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్‌ ప్రసంగించారు. ఏపీని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్‌ విలేజీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఎన్నారైలు తమ తమ సొంత గ్రామాలతో పాటుగా మరొక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాభివృద్ధి పాలుపంచుకోవాలని కోరారు.దీనికి స్పందించిన డెట్రాయిట్‌లోని ప్రముఖ తెలుగు వ్యక్తి కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్‌ స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమానికి లక్ష డాలర్లను తానా తరఫున విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

 నారా లోకేష్

నారా లోకేష్

ఈ మేరకు లోకేష్‌కు ఆయన చెక్‌ను అందజేశారు. తానా ఇప్పటికే ఎన్నోపథకాలను అమలు చేస్తోందని, గ్రామస్థాయిలో ఈ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కృష్ణప్రసాద్‌, లోకేష్‌ను కోరారు.

 నారా లోకేష్

నారా లోకేష్

దీనికి స్పందించిన లోకేష్‌ విరాళాలు సద్వినియోగమయ్యేలా ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని హామీ ఇచ్చారు.

 నారా లోకేష్

నారా లోకేష్

మరోవైపు ఈ సమావేశానికి హాజరైన వాసింగ్టన్‌ డీసీ, మేరీలాండ్‌, వర్జీనియా రాష్ట్రాల్లోని ఎన్నారైలు, పార్టీ అభిమానాలు ఏపీలో దాదాపు 2 వేల గ్రామాలను స్మార్ట్‌ విలేజీ పథకం కింద దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

 నారా లోకేష్

నారా లోకేష్

కాగా దత్తత తీసుకున్న గ్రామాలన్నింటినీ తానా, ఎన్నారై తెలుగుదేశం పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నట్లు తానా కార్యదర్శి సతీష్‌ వేమన తెలిపారు.

English summary
Nara Lokesh speech in Dallas , US over Smart villages
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X