వైఎస్ జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తర్వాత కూడా మారణ కాండ ఆగడం లేదు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టిడిపి కార్యకర్త గిరి నాథ్ చౌదరిని వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆయన సోదరుడు కళ్యాణ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
వేట కొడవళ్ళతో దాడి.. టీడీపీ కార్యకర్త మృతి
ఏపీలో ఎన్నికల ప్రచార సమయం నుంచి చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు, కొనసాగుతున్న దాడులకు ఈ దారుణ ఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. బొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో నిన్న సాయంత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు టిడిపికి చెందిన గిరి నాథ్ చౌదరి ఆయన సోదరుడు కళ్యాణ్ ఇంటికి వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా వేట కొడవళ్ళతో దాడికి దిగారు.

బొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో ఉద్రిక్తత.. పోలీసుల బందోబస్తు
గిరి నాథ్ తలపై గాయం కాగా ఆయనను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందాడు. ఇక తీవ్ర గాయాల పాలైన కళ్యాణ్ ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. దీంతో ఒక్కసారిగా కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో మళ్లీ తిరిగి దాడులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడన్న లోకేష్
కర్నూలు ఎస్పీ కృష్ణ కాంత్ బొమ్మిరెడ్డి పల్లి కి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఇదిలా ఉంటే ఈ దారుణ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైయస్ జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని లోకేష్ మండిపడ్డారు.
వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన టిడిపి నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. హత్యా… pic.twitter.com/NHhJCzmNV1
— Lokesh Nara (@naralokesh) June 10, 2024
జనం ఛీకొట్టినా జగన్ చేస్తుందిదే
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన టిడిపి నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్ రెడ్డి అంటూ విమర్శించారు.
హత్యా రాజకీయాలు ఆపకుంటే తీవ్ర పరిణామాలు
హత్యా రాజకీయాలు ఇకనైనా జగన్ రెడ్డి ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. గౌరీనాథ్ చౌదరి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందన్నారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని, వైసిపి ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతాం. శాంతిభద్రతలు కాపాడుతాం అని నారా లోకేష్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications