లోకేష్ కు ప్రమోషన్ - బాలయ్యకు కీలక బాధ్యతలు..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమిలోని పార్టీలు తమ భవిష్యత్ ప్రణాళికలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ ఒక్కరే ఉన్నారు. పవన్ కు ప్రాధాన్యత దక్కకుండా ఆయనకు మాత్రమే ఆ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. ఇదే సమయంలో.. నారా లోకేష్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తు న్నారు. తన పదవి విషయంలో ఆసక్తి కర ప్రతిపాదన చేసారు.
టీడీపీలో కీలక మార్పులు
కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ డిప్యూటీ సీఎంగా ఉంటూ రాజకీయంగా - పాలనా పరంగా తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ శైలి పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి కీలక డిమాండ్ బలంగా వినిపిస్తోంది. టీడీపీలో.. ప్రభుత్వంలో లోకేష్ కు ప్రాధాన్యత పెరగాలని పార్టీ నేతలు కోరుతున్నారు. డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలని ఓపెన్ గానే తమ వాదన వినిపిస్తున్నారు. అయితే, పవన్ కు ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా.. డిప్యూటీ సీఎం పదవి పవన్ కు మాత్రమే కొనసాగించేలా చంద్రబాబు నిర్ణయించారు.

లోకేష్ ప్రతిపాదన
డిప్యూటీ సీఎం హోదాలో ఇతర మంత్రులతో సమానంగానే అధికారాలు ఉంటాయి. కానీ, పవన్ మాత్రం ప్రభుత్వంలో భాగస్వామ్య పక్ష నేతగా తన మార్క్ నిరూపించుకునే ప్రయత్నం ప్రతీ సందర్భంలో చేస్తున్నారు. దీనిని గమనిస్తున్న టీడీపీ సీనియర్లు.. లోకేష్ ను ప్రమోట్ చేసేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ముందుగా పార్టీలో లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్ పైన అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇందు కోసం లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పైనా అంచనాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలలే కావటంతో.. చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో...మరి కొంత కాలం తరువాత లోకేష్ విషయంలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు.
లోకేష్ కు పదోన్నతి - బాలయ్య కు
ఇప్పుడు లోకేష్ చేసిన ప్రతిపాదన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో పార్టీలో ఎవరైనా ఒకే పదవిలో రెండు సార్లు కొనసాగిన తరువాత ఉన్నత పదవిలోకి అయినా వెళ్లాలి.. లేదా, ఓ విడత ఖాళీగా అయినా ఉండాలి అని ప్రతిపాదించారు. పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..తాను పదవి తీసుకోకుండా ఉండాలి.. అందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీని వలన క్షేత్ర స్థాయిలో వారు పోలిట్ బ్యూరోలోకి వస్తారని చెప్పుకొచ్చారు. దీని ద్వారా .. లోకేష్ ప్రధాన కార్యదర్శి పదవి వీడేందుకు సిద్దమైనట్లు చెబుతున్నా.. పార్టీ పోలిట్ బ్యూరో అంగీకరించే అవకాశం తక్కవ. అదే సమయంలో లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పైన నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటుగా నందమూరి బాలకృష్ణకు పార్టీ పదవిలో ప్రమోషన్ ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications