Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్జీవీ వ్యూహం సినిమాకు అనుమతివ్వొద్దు-సెన్సార్ బోర్డుకు లోకేష్ లేఖ...

ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ పై టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా కలకలం రేపుతోంది. ఈ చిత్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నట్లు దీని టీజర్, ట్రైలర్లు చూస్తే అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకే్ష్ ఇవాళ ఈ సినిమాను అడ్డుకోవాలని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఆరు పేజీల లేఖలో లోకేష్ పలు అంశాల్ని ప్రస్తావించారు.

nara lokesh urges censor board to stop release of ramgopal varmas vyuyam movie on ys jagan

సీఎం జగన్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ తో ముగియనుందని, ఈ నేపథ్యంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో రాంగోపాల్ వర్మ ఆయనపై వ్యూహం చిత్రాన్ని తీస్తున్నారని నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు తెలిపారు. ఇందులో తన తండ్రి చంద్రబాబుతో పాటు తననూ కించపరిచేలా పలు సన్నివేశాలు ఉన్నాయని, ఇవి పరువునష్టం దావా కిందకు వస్తాయని తెలిపారు. రెండు వారాల క్రితం ఈ సినిమా ట్రైలర్ విడుదలైందని, ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని, తన తండ్రి జైల్లో ఉన్నారని, కాబట్టి ట్రైలర్ తో సదరు సన్నివేశాలు ఉన్నట్లు తమకు తెలియలేదన్నారు.

కాబట్టి వ్యూహం సినిమా ట్రైలర్, ప్రెస్ మీట్ లో దర్శకుడు వర్మ, నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడిన మాటల ఆధారంగా ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. వీటి ఆధారంగా ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. జగన్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి అయిన తన తండ్రి చంద్రబాబును ప్రతిష్టను దిగజార్చేలా ఈ సినిమా ఉందన్నారు. జగన్ తనను తాను ఓ గొప్ప వ్యక్తిగా చిత్రీకరింపజేసుకోవడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తనను ఈ చిత్రంలో అమాయకుడిగా చూపించడం, సోనియాగాంధీ, చంద్రబాబు కూడా అలా చెప్పినట్లు చూపడం, 11 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసులున్న జగన్ ను గొప్ప వ్యక్తిగా ఈ సినిమాలో చూపారని లోకేష్ ఆరోపించారు. అలాగే స్కిల్ కేసులో తన తండ్రిపై సీఐడీ చేసిన ఆరోపణలన్ని నిజాలన్నట్లుగా ఈ సినిమాలో చూపారని, ముడుపులు తీసుకున్నట్లు చెప్పారని తెలిపారు. కాబట్టి ఈ చిత్రం సదరు స్కిల్ కేసు విచారణను కూడా ప్రభావితం చేస్తుందన్నారు. కాబట్టి సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం ఈ చిత్రానికి అనుమతి నిరాకరించాల్సిందిగా లోకేష్ కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+