• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అందరి ఖాతాలు సెటిల్ చేస్తాం .. రెండింతలు తీసుకొనేందుకు రెడీ అవ్వండి .. నారా లోకేష్ వార్నింగ్

|

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డారు. గ్రామాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటూ నిప్పులు చెరిగారు. రెండేళ్ల జగన్ రెడ్డి పాలనలో అరాచకాలు, విధ్వంసాలే కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాన్సాస్ తీర్పు చీకటి జీవోలు జారీ చేస్తున్న జగన్ సర్కార్ కు చెంపపెట్టు : లోకేష్, అచ్చెన్న ధ్వజంమాన్సాస్ తీర్పు చీకటి జీవోలు జారీ చేస్తున్న జగన్ సర్కార్ కు చెంపపెట్టు : లోకేష్, అచ్చెన్న ధ్వజం

 టీడీపీ సర్పంచ్ భర్తపై వైసీపీ నాయకులు దాడి చేశారన్న లోకేష్

టీడీపీ సర్పంచ్ భర్తపై వైసీపీ నాయకులు దాడి చేశారన్న లోకేష్

ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామంటే వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఒక గ్రామ సర్పంచ్ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి ఫైర్ అయిన లోకేష్ అమరావతి మండలం ఉంగుటూరు సర్పంచ్ అనురాధ చెరువు మరమ్మతు పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేయగా అడ్డుకున్న వైసీపీ నాయకులు శివా గ్యాంగ్, సర్పంచ్ భర్త సోమశేఖర్, అతని అనుచరులు పై దాడికి తెగబడ్డారన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవటం అన్యాయం అని అసహనం

వారిని తీవ్రంగా గాయపరిచారు అని ,అంతు చూస్తామని హెచ్చరించడం వైసిపి అరాచకాలకు అద్దం పడుతోందని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో గ్రామంలో భయానక వాతావరణం సృష్టించిన వైసిపి నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం అన్యాయం అంటూ పేర్కొన్నారు. పోలీసులు సైతం వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

 ప్రతి దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదు అని వార్నింగ్

ప్రతి దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదు అని వార్నింగ్

టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పడిన ప్రతి దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదు. మూడేళ్లలో మూర్ఖపు రెడ్డి పాలనకు మూడిపోతుంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు అందరి ఖాతాలు సెటిల్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. గ్రామంలో మనుషుల్లా, మానవత్వంతో మెలిగితే గౌరవం దక్కుతుందని పేర్కొన్న నారా లోకేష్ అలా కాకుండా అధికారం అండ ఉందని అహంకారంతో అరాచకాలకు తెగబడితే రెండింతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి అంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతున్నాయంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

English summary
TDP national general secretary Nara Lokesh has lashed out at the ruling Jagan govt in the AP. He was outraged that anarchy and destruction continued during the two-year rule of Jagan Reddy. "We will settle everyone's accounts and be ready to double the number of YCP leaders who commit attacks," Lokesh warned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X