కొత్త రీతిలో యుద్ధం మొదలుపెట్టిన నారా లోకేష్.. సక్సెస్ అవుతారా?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు ఈ కేసులో నుండి బయట పడటం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.కోర్టులను ఆశ్రయిస్తూ న్యాయ పోరాటానికి దిగారు. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
చంద్రబాబుకు దేశ విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ఏపీలో చంద్రబాబు కోసం జరుగుతున్న నిరసనలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా లోకేష్ ఢిల్లీ వెళ్లి అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపధ్యంలో స్పందించాలని విజ్ఞప్తి చేసి, ఏపీలో వైసీపీ అవినీతి, అసమర్ధ పాలనను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు. ఇక సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళను, చంద్రబాబు అభిమానులను ఉద్యమానికి సిద్ధం చేసే పనిలో ఉన్న నారా లోకేష్ తాజాగా యువ గళం పాదయాత్ర ద్వారా పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా పోరాటాన్ని ఉధృతం చెయ్యాలని భావిస్తున్న లోకేష్ కొత్త రీతిలో యుద్దానికి సిద్ధం అయ్యారు. ప్రజలను చైతన్యవంతులను చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ తాజాగా తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసిన ఒక పాట చంద్రబాబు కోసం జనం కదిలిరావాలని పిలుపునిస్తుంది. పలువురు కళాకారులు 'చంద్రబాబుకు మద్దతుగా ఇది అందరూ కదలాల్సిన సమయం' అంటూ పిలుపునిస్తూ పాటలు రాస్తున్నారు.
వాటిల్లో ఒకటైన 'తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా...' అనే ఓ పాటను లోకేష్ తన యూట్యూబ్ చానల్‌లో పంచుకున్నారు. ఈ పాట ద్వారా లక్షలుగా జనం చంద్రబాబుకు అండగా కదిలితే వైసీపీ సర్కార్ వెన్నులో వణుకు పుడుతుందని, చంద్రబాబు జనం కోసం బతికిన నాయకుడని, ఆయన కోసం అందరూ కదిలి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
గడప గడప కదలాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. లోకేష్ కోరినట్టు ప్రజల నుండి అంతటి స్పందన వస్తుందా? చంద్రబాబు కోసం సాగిస్తున్న పోరాటం ఉధృతం చెయ్యాలని భావిస్తున్న నారా లోకేష్ ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలియాల్సి ఉంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications