ఏపీలో తొలి ఫలితం తేలేది అక్కడే
ఏపీలోలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఉదయం 8.30 కి EVMల కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. అత్యధికంగా విశాఖ పార్లమెంటు బరిలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు పోటీ చేయగా, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇక తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తేలే అవకాశం కనిపిస్తోంది. నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తొలి ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరిగా ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. ఇక అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గరిష్టంగా 27 రౌండ్లు , రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం తేలిపోనుంది. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications