Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలోకి వైసీపీ ఎంపీ - తేల్చి చెప్పేసారు..!!

వైసీపీకి చెందిన ఎంపీ టీడీపీలోకి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని పైన ఎంపీ స్పందించారు. క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. నేతల పార్టీ జంపింగ్స్ మొదలయ్యాయి. నెల్లూరులో తాజా పరిణామాల తరువాత పార్టీ వారే గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పలువరు టీడీపీ నేతలు వైసీపీతో టచ్ లో ఉన్నారని.. మరి కొందరు వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. ఇప్పటికే వైసీపీ...టీడీపీ నుంచి అభ్యర్దుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది.

టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. సీట్ల ఖరారు పైన కొన్ని నియోకవర్గాల్లో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు వైసీపీకి చెందిన ఎంపీ టీడీపీలోకి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని పైన ఎంపీ స్పందించారు. క్లారిటీ ఇచ్చారు.

Narasaraopet MP Lavu Krishna devarayulu puts an end to the news of he switching the party, here is what he clarified

2019 ఎన్నికల్లో వైసీపీ 22 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. అందులో నర్సరావు పేట స్థానం నుంచి యువ ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయలు గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివ రావు పైన గెలుపొందారు. అదే స్థానం నుంచి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసారు.

ఇక.. ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత తన పార్లమెంటరీ పరిధిలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో ఎంపీకి గ్యాప్ ఉంది. తన మాట చెల్లుబాటు కావటం లేదనే భావనలతో ఎంపీ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఆయనను వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా బరిలోకి దించేందుకు కసరత్తు సాగుతున్నట్లు గుంటూరు జిల్లా వైసీపీలో వినిపిస్తోంది. ఈ సమయంలోనే ఎంపీ శ్రీక్రిష్ణ దేవరాయలు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.

Narasaraopet MP Lavu Krishna devarayulu puts an end to the news of he switching the party, here is what he clarified

ఒక దశలో ఎంపీ శ్రీక్రిష్ణ దేవరాయలు నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారనే ప్రచారమూ తెర పైకి వచ్చింది. దీంతో..ఎంపీ తన పార్టీ మార్పు ప్రచారం పైన స్పందించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎంపీగా గెలిచిన శ్రీక్రిష్ణ దేవరాయలు తాను అసలు చంద్రబాబును కలవలేదని తేల్చి చెప్పారు.

ఇదంతా అసలు ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు తెలియదని స్పష్టత ఇచ్చారు. తాను ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతలను తాను చూసుకుంటున్నానని వెల్లడించారు. ఈ రకమైన ప్రచారం మంచిది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. దీంతో..ఎంపీ శ్రీక్రిష్ణ దేవరాయలు పార్టీ మార్పు ప్రచారానికి ముగింపు ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+