'ప్రకటనకు 3 నెలల ముందు బీజేపీ నేతల బ్యాంక్ అకౌంట్లు పరిశీలిస్తే.., మోడీని దింపేసేవాళ్లు'
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటనకు మూడు నెలల ముందు నుంచి బీజేపీ నేతల బ్యాంకు అకౌంట్లను పరిశీలించాలని, అప్పుడు వారి బాగోతం బయటపడుతుందని సిపిఐ నేత నారాయణ అన్నారు.
రాజమహేంద్రవరం: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనకు మూడు నెలల ముందు నుంచి బీజేపీ నేతల బ్యాంకు అకౌంట్లను పరిశీలించాలని, అప్పుడు వారి బాగోతం బయటపడుతుందని సిపిఐ నేత నారాయణ అన్నారు.
ఆయన ఆదివారం నాడు ఏపీలోని రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. కార్పోరేట్ శక్తులు, దొంగలను కాపాడేందుకే ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. ఈ నిర్ణయం వెనుక పెద్దలను కాపాడే యత్నమని చెప్పారు.

నోట్ల రద్దుతో కార్పోరేట్ కంపెనీలకు నష్టం వచ్చి ఉంటే ప్రధాని పదవి నుంచి మోడీని దింపే వాళ్లన్నారు. మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు 50 రోజుల పాటు అన్నం తినకుండా ఉంటే ప్రజలు కూడా సర్దుకుంటారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్క రైతు అకౌంటులో రూ.లక్ష జమ చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే బందుకు అందరు సహకరించాలన్నారు.
పెద్ద నోట్ల రద్దు తొందరపాటు
పెద్ద నోట్ల రద్దు తొందరపాటు చర్య అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగరాజన్ అన్నారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్ుదపై ప్రకటన వచ్చాక బ్యాంకు ఉద్యోగుల పైన ఒత్తిడి పెరిగిందన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో బంగారం ధర పడిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications