వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పవన్‌తో అందుకే మాటలు, జగన్-బాబులు మోడీతో భేటీ వెనుక ఇదీ'

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో అతనిని కలిసి తాము మాట్లాడుతున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి/విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో అతనిని కలిసి తాము మాట్లాడుతున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని పోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, జగన్‌లు కేసుల నుంచి బయటపడేందుకే ప్రధాని నరేంద్ర మోడీకి భజన చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో కరవు విలయతాండవం చేస్తుందన్నారు.

<strong>చంద్రబాబుకు షాకిచ్చిన టిడిపి సీనియర్ నేత</strong>చంద్రబాబుకు షాకిచ్చిన టిడిపి సీనియర్ నేత

Narayana reveals why they are supporting Pawan Kalyan

ఒక్క రాయలసీమ ప్రాంతం నుంచి అయిదారు లక్ష్లల మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస పోయారన్నారు. వీటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలు సాగిస్తున్నారన్నారు.

దేశానికి ఎందరో మేధావులను అందించిన జేఎన్టీయూను నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. సోషల్‌ మీడియాపై ఆంక్షలు సరికాదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు.

విశాఖలో జనసేన కార్యకర్తల ఎంపిక

ఉత్తరాంధ్రలో జనసేన కార్యకర్తల ఎంపిక కొనసాగుతోంది. ఇవాళ, రేపు విశాఖపట్టణంలో జనసేన కార్యకర్తల ఎంపిక జరుగుతుంది. స్పీకర్, రైటర్, ఎనలిస్ట్ పోస్టులకు సంబంధించి రెండు రోజుల పాటు రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే ఆరు వేల దరఖాస్తులు అందాయి. ఇక వచ్చిన దరఖాస్తుల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు శిబిరం నిర్వహిస్తున్నారు. కాగా, అనంతపురం, గ్రేటర్ హైదరాబాద్‌లలో పార్టీ కార్యకర్తలను తయారు చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తలమునకలై ఉన్నారు.

English summary
CPI Narayana reveals why they are supporting Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X