Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బయటపడ్డ టీడీపీ బండారం..ఏకిపారేసిన జాతీయ మీడియా సంస్థ

ఏపీలో ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందంటూ ఓ రకమైన ప్రచారం మీడియాలో జరుగుతోంది.ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున క్యాంపైన్ జరిగింది.దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూటమి గెలుస్తుందంటూ పందేలు కాసారు. లక్షకు లక్షన్నర ఇచ్చి మరీ పందేలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ గెలుస్తుందనేది కేవలం ప్రచారమే అని తేలిపోయింది.

టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్‌ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందుస్తాన్ టైమ్స్‌కి చెందిన లాజికల్ ఫాక్ట్స్ విభాగం పరిశోధన చేసి బయటపెట్టింది.ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్‌ పేరున సోషల్ మీడియాలో వైరల్‌గా తిరుగుతున్న స్క్రీన్‌షాట్ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది.

national media organization condemned TDP fake campaign

మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల అనంతరం టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయని దీని ప్రకారం టీడీపీ గెలుస్తుందని ఐ-టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వారి సోషల్ మీడీయా ఛానల్స్‌లో ప్రచారం చేసినట్టు తాము గుర్తించామని అయితే, ఈ స్క్రీన్ షాట్ పూర్తిగా కల్పితమని, 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోల్‌ను మార్ఫ్ చేసి స్క్రీన్‌షాట్ తీసి, ఆంధ్రప్రదేశ్‌దిగా ఉద్దేశపూర్వకంగా మార్చబడిందని స్పష్టం చేశారు.

తాము నిజనిజాలు తెలుసుకోవడానికి టైమ్స్ నౌ కు చెందిన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్‌లను శోధించామని, కానీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచురించబడిన డేటా ఎక్కడా కనుగొనబడలేదని తేల్చి చెప్పింది. 2021లో ఉత్తరప్రదేశ్ ఒపీనియన్ పోల్‌ను ప్రచురించేటప్పుడు టైమ్స్ నౌ ఇదే విధమైన టెంప్లేట్‌ను ఉపయోగించినట్లు తాము చేసిన రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెల్లడైందని, నవంబర్ 16, 2021న టైమ్స్ నౌ ప్రచురించిన ఈ ఒపీనియన్ పోల్‌‌లోని స్లైడ్ తారుమారు చేసినట్లు తాము కనుగొన్నామని, నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అంచనాలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న మాత్రమే విడుదల చేయబడతాయని స్పష్టం చేసింది.

దీంతో టీడీపీ పనికట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలు మరోసారి బయటపడినట్లైంది.దీనిపై అధికార వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. దేశంలో జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధమని తెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించబోయి టీడీపీ పరువు పోగొట్టుకుందని దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+