తిరుమల బ్రహ్మోత్సవాలు, మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు !
తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో (mohini avatara) శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు.
గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు (devotees) అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని (Tirumala) దర్శించుకున్నారు.

మోహినీ అవతారం అంటే మాయా మోహ నాశనం అని చరిత్ర చెబుతోంది.
ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ. ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో గరుడసేవ, టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు ఇవే, ఘాట్ రోడ్లలో బ్యాన్ బ్రదర్, శ్రీవారి!
గురువారం రాత్రి 6.30 గంటలకు విశేషమైన గరుడవాహనంపై (garudaseva) శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు.
గరుడ వాహనం (garudaseva) తిలకిస్తే సర్వపాప ప్రాయశ్చిత్తం

అని అర్థం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ (garudaseva)అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం (garudaseva)ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని (garudaseva) దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.












Click it and Unblock the Notifications