Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ హిట్ లిస్ట్ లోకి ఆ పార్టీ అధ్యక్షుడు..! విడదల రజనీ టార్గెట్ తో..!

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ నేరుగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు, కౌంటర్లు, పంచ్ లు చూస్తున్నాం. కానీ తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ప్రత్యర్ది పార్టీ తమ కార్యకర్తల కోసం ప్రారంభించిన హిట్ లిస్ట్ లోకి వచ్చి చేరారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ ఇలా మరో పార్టీ హిట్ లిస్ట్ లో చేరిన సదరు పార్టీ అధ్యక్షుడెవరో, దాని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం..

వైసీపీ తాజాగా కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న, ఇబ్బందులు పడుతున్న తమ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ప్రారంభించింది. ఇందులో వారిని ఇబ్బందిపెడుతున్న వారిపై ఫిర్యాదులు చేయాలని తమ క్యాడర్ కు సూచించింది. అయితే ఇందులో అనూహ్యంగా వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ తమపై దాడి చేసిందంటూ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం ఫిర్యాదు చేశారు. అంటే తన ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తల కోసం పెట్టిన హిట్ లిస్ట్ లో వాళ్ల పార్టీ నాయకురాలిపైనే ఫిర్యాదు చేశారన్నమాట.

navataram party president s name in ysrcp hit list- here is why

దీంతో వైసీపీకి చిర్రెత్తుకొచ్చింది. తమ పార్టీ నేత విడదల రజనీని టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా అంటూ రావు సుబ్రమణ్యంపై సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అంతే కాదు ఆయన్ను వాళ్ల హిట్ లిస్ట్ లో కూడా చేర్చారట. ఈ విషయాన్ని స్వయంగా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యమే వెల్లడించారు. తాను చేసిన ఫిర్యాదుపై స్పందించి న్యాయం చేయకపోగా డిజిటల్ బుక్ నిర్వహణ సంస్థ అయినటువంటి WeYSRCP అధికారిక ట్విట్టర్ ఖాతాలో బెదిరింపులు చేస్తూ తన పేరుతో పోస్ట్ పెట్టడం తనని ఎంతో బాధించినట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.

విడదల రజిని ఎటువంటి తప్పు చేయలేదు అని జగన్ సమర్ధించడం సరికాదని, దాడి చేసిన వ్యక్తి జగన్, రజనితో కలసి దిగిన ఫోటో మీడియా సమావేశంలో విడుదల చేశారు. కూటమికి మద్దత్తు ఇచ్చిన మాట వాస్తవం అని, జగన్ హయాంలో జరిగిన దాడులు చూసే కూటమికి మద్దత్తు ఇచ్చామని తెలిపారు. అధికారంలో లేనప్పుడే ఇలాంటి బెదిరింపులు చేస్తే రేపు జగన్ అధికారం లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందన్నారు.

navataram party president s name in ysrcp hit list- here is why

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత వైస్సార్సీపీ బెదిరింపులు చేస్తూ పెట్టిన ట్వీట్ గమనించి నాకు తగిన భద్రత కల్పించాలని రావు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. డిజిటల్ బుక్ లో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని, కేవలం విడదల రజిని వంటి వైస్సార్సీపీ నేతలకు మాత్రమే న్యాయం జరుగుతుంది అని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+