అర్థంచేసుకోండి: పవర్‌పై నాయిని, టీఎస్ ఇప్పుడే కాదని

పోలీసులు ఎంత సమర్థవంతంగా పని చేస్తే ప్రజలకు ప్రభుత్వ సేవలు అంతలా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతుల విషయంలో పోలీసులు సంయమనం పాటించాలని హితవు పలికారు. మెదక్ జిల్లాలో రైతుల పైన జరిగిన లాఠీఛార్జీ పైన సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాదుకు గవర్నర్ ప్రత్యేక అధికారాలను పోలీసు అధికారుల సంఘం కూడా వ్యతిరేకించిందని నాయిని చెప్పారు. పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ.300 కోట్లు విడుదల చేశారన్నారు.
వాహనాలు సిరీస్ మార్పుపై హైకోర్టులో విచారణ
వాహనాల సిరీస్ మార్పు పైన సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ నుండి టీఎస్‌గా వాహనాల సిరీస్ మార్చాలనే జీవో సరికాదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. జీవో 3 ఇప్పటికిప్పుడు టీఎస్‌గా మార్చే జీవో కాదని, ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకే దానిని విడుదల చేశామని చెప్పారు. ఇప్పటికిప్పుడు టిఎస్‌గా మార్చే జీవో కానందున నష్టం లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు తదిపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications