'రేవంత్ లాంటి బచ్చాకు.. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎక్కడిది?'
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. రేవంత్ రెడ్డి ఓ బచ్చా అని.. అలాంటి బచ్చాకు సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని చెప్పిన నాయిని.. పార్టీని బ్రతికించుకోవడానికి రేవంత్ చేస్తున్న విన్యాసాలు పనిచేయవని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతూ రాజకీయ విలువలను దిగజార్చే ప్రయత్నం చేయవద్దని రేవంత్ కు హితవు పలికారు నాయిని. గ్యాంగ్ స్టర్ నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని ఆరోపించిన నాయిని.. ప్రస్తుతం నయీం కేసును సిట్ విచారణ చేస్తుందని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందినవారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications