రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ లు పావులు కదుపుతున్నాయి. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి పార్టీలు రాజ్యసభ అభ్యర్దుల ఖరారు పైన ఒక అంచనాకు వచ్చాయి. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అందులో మూడు పార్టీలు సీట్లను పంచుకోవటం పైన లెక్క ఖరారైంది. అదే విధంగా అభ్యర్దులు దాదాపు ఫిక్స్ అయ్యారు.
ఏపీ నుంచి రాజ్యసభలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు సీట్లు కూటమి కే దక్కనున్నాయి. దీంతో.. ఈ నాలుగు సీట్లలో రెండు టీడీపీ, బీజేపీ- జనసేన చెరో సీటు దక్కేలా నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, టిడిపి నుంచి సానా సతీష్ పదవీ కాలం వచ్చే జూన్ 21తో ముగియనుంది. వీరిలో టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో సానా సతీశ్ కు తిరిగి రెన్యువల్ చేయాలని దాదాపు నిర్ణయించారు. టీడీపీకి మరో సీటు దక్కనుంది. ఆ సీటును భారత్ బయోటెక్ సంస్థ అధినేత యల్లా కృష్ణ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ.. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సైతం రేసులో ఉన్నారు. అదే విధంగా బీజేపీ నుంచి ఒక స్థానానికి అవకాశం కల్పించగా..తమిళనాడులో కీలక నేతగా వ్యవహరిస్తూ ఇటీవలి ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్న అన్నామళైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బిజెపి అధినాయకత్వం డిసైడ్ అయి నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలోనూ అన్నామలైకు స్థానం దక్కే అవకాశం ఉంది.

కూటమి నేతల కొత్త లెక్కలు
ఇక జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ను పంపాలని దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మేరకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. జనసేన పార్టీ కార్యాలయం విజయవాడ కేంద్రంగా కొంతకాలం నడించింది. ఈ నివాసం కూడా రమేష్‌దేనని చెబుతారు. దీంతో రమేష్ అభ్యర్ధిత్వానికి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే లింగమనేని విషయంలో టీడీీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కూటమి నుంచి ఎంపిక చేసే నాలుగు స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో జనసేన నుంచి అల్లు అరవింద్ పేరు సైతం ప్రచారంలో ఉంది. ఈ విషయంలో పవన్ కల్యాన్ చివరకు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ నుంచి రాజ్యసభ రేసులో ప్రముఖులు ఉండటంతో.. కూటమి నుంచి ఖరరాయ్యే పెద్దల సభ అభ్యర్దుల విషయంలో ఆసక్తి నెలకొంది.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications