మహిళల ఖాతాల్లో రూ 10 వేలు - కూటమి ప్రభుత్వం సంచలనం..!?

ఎన్డీఏ ఆపరేషన్ 2029 మొదలు పెట్టింది. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు గతం కంటే భిన్నం గా ప్రజాకర్షక నిర్ణయాలకు మొగ్గు చూపుతుంది. వరుసగా హర్యానా, మహారాష్ట్ర తాజాగా బీహార్ లో విజయం సాధించిన ఎన్డీఏ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. ప్రజానాడి పట్టుకోవటంలో సక్సెస్ అయిన ఎన్డీఏ నేతలు.. ఎక్కడ ఏ అస్త్రం ప్రయోగించాలో అదే చేస్తున్నారు. 2029 లో ఏపీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవటానికి ఇప్పటికే ఎన్డీఏ టీం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా భారీ ఆకర్షక పథకం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి..అదే జరిగితే జగన్ కు ఆప్షన్ ఏంటి...

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు భారీ విజయం దక్కింది. మహిళా ఓటర్లే ఈ విజయానికి కారణమని ఫలితాల సరళి స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందుగానే నితీశ్ సర్కార్ పెద్ద సంఖ్య లో ఉన్న మహిళలను తమ వైపు తిప్పుకోవటానికి ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన పథకం తీసుకొచ్చారు. ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు చేసారు. ఈ నిర్ణయమే తాజా గా నితీశ్ కు మళ్లీ బంపర్ మెజార్టీతో అధికారం నిలబెట్టింది.

NDA s New Push Winning Support from Women and Young Voters in AP to fix YSRCP

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదంతో మోదీ - రాష్ట్రాల్లోని ఎన్డీఏ మిత్రులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ పథకం తదుపరి దశల్లో వారు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది. పలు రంగాల్లో మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు. మహిళల ఆర్థిక కార్యకలాపాలకు సహాయ, సహకారాలు అందిస్తారు. అవసరమైన శిక్షణ కూడా కల్పిస్తారు. ఈ పథకం పైన ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు తమ రాష్ట్రాల్లో అమలుకు సాధ్యా సాధ్యాల పై ఫోకస్ చేసారు. అయితే.. ఈ పథకం ద్వారా వచ్చే ఫలితం చూసిన తరువాత అమలుకు నిర్ణయించే ఆలోచన చేయగా.. ఇప్పుడు ఇదే బీహార్ లో అధికారం నిలబెట్టింది. ఇక.. ఇప్పుడు ఈ పథకం పైన చర్చ మొదలైంది. ఏపీలో 2024 ఎన్నికల్లోనూ జగన్ పైన వ్యతిరేకతతో పాటుగా సూపర్ సిక్స్ హామీలు కూటమిని గెలిపించాయి.

ఏపీలో ఇప్పటికే భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆర్దికంగా ఈ పథకాల నిర్వహణ భారంగా మారింది. ఇంకా కూటమి ప్రభుత్వం మహిళలకు రూ 1500 చొప్పున ఇస్తామని చెప్పిన హామీ అమలు కావాల్సి ఉంది. అయితే, రాజకీయంగా ఎన్నికల్లో మరింత ఆకర్షణీయంగా హామీలు ఇస్తేనే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో.. అధికారం లో ఉన్న కూటమి ప్రభుత్వం నితీశ్ తరహాలోనే ఈ పథకం అమలుకు ఛాన్స్ ఉందనే చర్చ ఇప్పటికే వినిపిస్తోంది. మరి.. అధికారంలో ఉన్న కూటమి అదే నిర్ణయం అమలు చేయటం జరిగితే.. ఈ సారి అధికారం తమదే అని చెబుతున్న జగన్ కు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. అయితే.. అసలు ఈ పథకం ఏపీలో ఉన్న ఆర్దిక పరిస్థితుల్లో సాధ్యమేనా.. అమలు చేస్తారా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వచ్చే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+