NEET UG ఫలితాలు విడుదల: ఏపీకి చెందిన విద్యార్థికి 99.99 పర్సంటైల్, టాప్ 10లో వీరే
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న నీట్ యూజీ ఫలితాలు(NEET UG 2023) విడుదలయ్యాయి. మే 7న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులకు 720/720 మార్కులు సాధించి అదరగొట్టారు. అయితే, ఈ ఇద్దరిలో ఓ తెలుగు విద్యార్థి ఉండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బోరా వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ 99.99 పర్సంటైల్ సాధించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. నీట్‌కు అర్హత సాధించిన వారిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి గరిష్ట స్థాయిలో అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

NEET UG ఫలితం 2023: టాపర్స్ జాబితా:
ప్రభంజన్ జె
బోరా వరుణ్ చక్రవర్తి
కౌస్తవ్ బౌరి
ప్రాంజల్ అగర్వాల్
ధ్రువ్ అద్వాన్
సూర్య సిద్ధార్థ్ ఎన్
శ్రీనికేత్ రవి
స్వయం శక్తి త్రిపాఠి
వరుణ్ ఎస్
పార్త్ ఖండేల్వాల్.
NEET UG 2023 ఫలితాల ప్రకటన తర్వాత.. NEET UG 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ - neet.nta.nic.in లో చూసుకోవచ్చు . అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ మరియు సెక్యూరిటీ పిన్. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడంతో పాటు, అభ్యర్థులు తమ నీట్ 2023 ఫలితాలను డిజిలాకర్ యాప్‌లో కూడా తనిఖీ చేయవచ్చు.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్ తోపాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4097 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్షర్ కీని విడుదల చేసింది. దీనిపై జూన్ 6 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణలోకి తీసుకున్న ఎన్టీఏ అధికారులు తాజాగా తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications