కుక్కలకు ఇచ్చే ఇంజక్షన్స్ ఇచ్చి బావను చంపేసిన బావమరిది!

సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకూ కనుమరుగు అవుతున్నాయి. పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పిల్లలు, భార్యలను భర్తలు, భర్తలను భార్యలు చంపుకుంటూ గతంలో అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా బావను బావమరిది హతమార్చిన సంఘటన ఒక్కసారిగా అందర్నీ షాక్ కు గురి చేసింది.

కుక్కలను చంపే ఇంజక్షన్ ఉపయోగించి శ్రీహరి హత్య

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదం కారణంగా సొంత బావమరిది హరికృష్ణ కుక్కలను చంపే ఇంజక్షన్ ఉపయోగించి శ్రీహరి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు ముఖ్య నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

nellore murder brother in law killed agriculture officer srihari by giving dogs injections to him

శ్రీహరిని ఆస్తి కోసం అడ్డు తప్పించుకోవాలని ప్లాన్

వ్యవసాయ అధికారి శ్రీహరి తాను సంపాదించిన కోట్ల విలువైన ఆస్తిని బామ్మర్ది అయిన హరికృష్ణకు రాసిచ్చాడు. ఆస్తితో పాటు అప్పులు కూడా ఇచ్చాడు. ఇల్లు కట్టుకోవాలని ఉందని, బామ్మర్ది పేరు మీద ఉన్న ఆస్తి తిరిగి ఇవ్వాలని శ్రీహరి హరికృష్ణను అడిగాడు. అప్పుడు హరికృష్ణ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇదే క్రమంలో శ్రీహరిని ఆస్తి కోసం అడ్డు తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు.

కుక్కలకు చేసే ఇంజక్షన్లతో గుండెపోటు.. బావ మృతి

జూన్ 15 వ తేదీన దైవదర్శనానికి వెళదామని నమ్మించి కార్ లో పెంచలకోనకు తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తుండగా కారు ఆపై ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు రవీంద్ర, యానాదయ్యల సహాయంతో శ్రీహరిని పట్టుకుని కుక్కలకు చేసే ఇంజక్షన్లు రెండు చేశారు. దీంతో శ్రీహరి గుండె ఆగిపోయింది. ఆపై దీనిని గుండెపోటుగా చిత్రీకరించి, శ్రీహరి సొంత ఊరు అయిన మినగల్లు కు తీసుకువెళ్ళి దహన సంస్కారాలు చేశారు.

సొంత బావనే హతమార్చి బావమరిది చేసిన ఘాతుకం

శ్రీహరి భార్య లావణ్య తర్వాత అనుమానం వచ్చి డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి రవీంద్ర, యానాదయ్య లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హరికృష్ణ పరారీలో ఉన్నాడు. ఆస్తి కోసం సొంత బావనే హతమార్చి బావమరిది చేసిన ఘాతుకం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం మానవ సంబంధాలకు అర్ధం లేదన్న సంకేతాన్ని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+