నెల్లూరులో బ్లేడ్ బ్యాచ్ అరెస్ట్.. పోలీసులు ఊహించని శిక్ష..
నెల్లూరులోని బోసుబొమ్మ జంక్షన్ లో ఆదివారం ఓ బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో బైక్స్ తో బస్సును వెంబడించి రోడ్డు మధ్యలోనే బస్సులోకి దూరారు దుండగులు. ప్రయాణికులు చూస్తుండగానే సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడుతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితులను 24 గంటల వ్యవధిలోపే అరెస్ట్ చేశారు. అయితే వారికి ఊహించని శిక్ష విధించారు.
నెల్లూరులో సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడుతో దాడి చేసిన ఐదుగురు నిందితులను 24 గంటల వ్యవధిలోపే పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వినూత్నమైన శిక్ష విధించారు. గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించారు పోలీసులు. దాడులు, హత్యలకు పాల్పడితే ఇక నుంచి నిందితులకు ఇలాంటి ట్రీట్ మెంట్ ఉంటుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. యువత సన్మార్గంలో నడుచుకోవాలని, నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసుల సూచనలు చేశారు. పిల్లలు తప్పు దోవ పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని హితవు పలికారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు గ్రామీణ మండలంలోని మహాత్మాగాంధీనగర్ కు చెందిన మన్సూర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఇందుకూరుపేటకు చెందిన సలామ్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మద్యం మత్తులో కొందరు యువకులు రోడ్డుకు అడ్డంగా బైక్ లు పెట్టి మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్ హారన్ కొట్టినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్ కిందకు దిగి ఓ బైక్ తాళం తీసుకుని బస్సులో వెళ్లిపోయారు. దీంతో ఆ యువకులు బస్సును వెంబడించారు. అలా బస్సులో దూరి డ్రైవర్, కండక్టర్ పై విచక్షణా రహితంగా బ్లేడ్స్ తో గాయపరిచారు. వెంటనే స్థానికులు వారిని సమీప ఆస్పత్తికి తరలించారు.
డ్రైవర్–కండక్టర్లపై బ్లేడ్ దాడి దుండగులకు ధర్మసిక్ష.!
— oneindiatelugu (@oneindiatelugu) December 8, 2025
రోడ్డుపైనే నడిపించిన పోలీసులు, వీడియో వైరల్!#APPolice #Nellore #AndhraPradesh #ViralWatch #Oneindia #OITelugu
సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై బ్లేడుతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు 24… pic.twitter.com/Et5dHUX0Kp
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి వినూత్న శిక్ష విధించారు. గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications