రేవంత్ - జగన్ పాలనలో ఇదే తేడా : ఇలా కదా చేయాల్సింది, వైరల్..!!

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం గ్యారంటీల అమలుకు కొత్త కార్యాచరణ డిసైడ్ చేసింది. పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. ఈ దరాఖాస్తులో సమర్పించాల్సిన ఆధార్ తో సహా ఇతర సర్టిఫికెట్ల కోసం పలు ప్రాంతాల్లో లబ్ది దారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ సమయంలోనే ఏపీలో ఇటువంటి అవసరం లేకుండా అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Recommended Video

    Revanth Reddy Vs Ys Jagan పాలనలో ఇదే తేడా ..ఇలా కదా చేయాల్సింది | Telugu Oneindia

    ఎక్కడ చూసినా క్యూ లైన్లు: తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీ ఇచ్చింది. ఇప్పుడు వీటి అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయబోతున్నఆరు గ్యారెంటీల కోసం... జనం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

    Netizens praising Volunteer system in AP, while comparing with People lines for guarantee schemes in TS

    రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్‌ కార్డు తప్పనిసరి కావడంతో సవరణల కోసం కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు. గ్యాస్ సబ్సిడీకి ఈ కేవైఎసీ కావాలని చెప్పటంతో వీటిని ఇచ్చేందుకు గ్యాస్‌ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.

    సర్టిఫికెట్ల కోసం బారులు: ప్రస్తుతం ఇలా బారులు తీరిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభుత్వం అన్ని పథకాలకు ఒకటే దరఖాస్తు అని చెబుతున్నా..జనంలో అవగాహన లేక ఇబ్బందులు వస్తున్నాయి. ఆరు గ్యారంటీలకు ఆరు అప్లికేషన్లు ఇవ్వాలనుకుని చాలామంది కుటుంబ సభ్యులతో పాటుగా దరఖాస్తులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

    పథకాల కోసం ఇలా ప్రజలు బారులు తీరటం..కేంద్రాల చుట్టూ తిరగటం.. తోపులాటలు..వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న నెటిజన్లు ఏపీలో అమలవుతున్న వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తావిస్తున్నారు.

    ఏపీలో ఇంటి ముందుకు పాలన: ఏపీలో ఏ ఒక్కరూ ఇలా ప్రభుత్వ కార్యాలయాలు..దరఖాస్తుల కోసం వెళ్లాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నారు.గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేస్తూ వాలంటీర్లు ఇంటికి వచ్చి సర్టిఫికెట్లను ఇవ్వటాన్ని వీడియోల రూపంలో పోస్టు చేస్తున్నారు.వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీలో ప్రజలకు పాలన గుమ్మం ముందుకు వచ్చిన విషయాన్ని ప్రధానంగా వివరిస్తున్నారు.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తేడాను పోల్చి సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. గడప వద్దే పాలన జగన్ హయాంలో ఏపీలో అమలవుతుందని..ప్రజలకు ఇదీ చేయాల్సింది అంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+