మంత్రి పదవి ఆశించలేదు.. రాలేదని నిరాశా లేదు, ఎన్నో సమీకరణాలు ఉంటాయి: ఎంపీ హరిబాబు

తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని తానేమీ ఆశించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. పదవి రాలేదని తాను ఎలాంటి నిరాశ చెందలేదని ఆయన వ్యాఖ్యాని

విశాఖపట్నం: తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని తానేమీ ఆశించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. పదవి రాలేదని తాను ఎలాంటి నిరాశ చెందలేదని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని బీజేపీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. శనివారం రాత్రి హరిబాబు కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లడంతో... ఆ పార్టీ శ్రేణులు సంబరపడ్డాయి. నగరానికి చెందిన కొంతమంది నాయకులు సైతం శనివారం రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Never Expected Minister Post, So that No Worry.. says Vizag MP Kambhampati Haribabu

కానీ అర్ధరాత్రి వరకూ వేచి చూసినా హరిబాబు పేరు బయటకు రాలేదు. ఆదివారం ఉదయమైనా వెల్లడిస్తారేమోనని ఆశగా ఎదురు చూసినా.. అదీ జరగలేదు. ఆఖరు నిముషంలో హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి చేజారిపోవడానికి కారణాలేమిటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీతో స్నేహపూర్వక సంబంధాలు నెరపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ, టీడీపీ సంబంధాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూడగలుగుతున్నారు.
వచ్చే రెండేళ్లలోనూ పార్టీ పరంగా కీలకంగా వ్యవహరించాల్సి ఉన్నందున తాజా విస్తరణలో అవకాశం ఇవ్వలేదేమోనన్న చర్చ జరుగుతోంది. దీనిపై హరిబాబు స్పందించారు.

పార్టీ అప్పగించిన ఎలాంటి బాధ్యతలనైనా సమర్ధంగా నిర్వహించాలనే తాను కోరుకుంటానని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు హాజరయ్యేందుకే ఢిల్లీ వెళ్లానని, పార్టీ పెద్దల నుంచి పిలుపొచ్చి కాదని అన్నారు.

మంత్రి పదవి ఇవ్వాలంటే చాలా రకాలైన సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుందని, అన్నీ అనుకూలిస్తేనే పదవులు వరిస్తాయన్నారు. పార్టీలో నిబద్ధత ఉన్న నాయకుడిగా అన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని హరిబాబు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+