తిట్లకు విరుగుడు: విమాన సౌకర్యాలతో అమరావతి బస్సులు, ప్రత్యేకతలివే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) కొంత పుంతలు తొక్కుతోంది. విమానాల్లో మాత్రమే ఉండే సౌకర్యాలను ఆర్టీసీ బస్సుల్లో కూడా కల్పించేస్తోంది. విమానాల్లో ఎక్కగానే నవ్వుతూ పలకరించే అటెండెంట్, సామాన్లు అందుకుని ర్యాక్ లో పెట్టి, సీటులో కూర్చోగానే చాక్లెట్ లు తెచ్చిచ్చి, ఆపై మంచినీరు, తినుబండారాలు, ముందుగా ఆర్డర్ చేస్తే మీల్స్.. వీటన్నింటికీ మించి ఇన్డివిడ్యువల్ ఎంటర్టెయినింగ్ సిస్టమ్ ఉండటం సాధారణమే.

కాగా, ఈ సౌకర్యాలన్నింటినీ విజయవాడలో సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన 'అమరావతి' బస్సుల్లో కల్పించారు. ఈ బస్సుల్లో తొలిరోజు ప్రయాణం చేసిన వారు 'వాహ్... సూపర్బ్' అంటూ వాటికి కితాబిచ్చేశారు.

వాస్తవానికి గరుడా ప్లస్ (మల్టీ యాక్సిల్ బస్సులు) బస్సులకే అమరావతి అని పేరు పెట్టి చార్జీలు మరికాస్త పెంచినపుడు ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. ఉన్న బస్సులకే 'అమరావతి' అని పేరు పెట్టారని ప్రజలు తిట్టిపోశారు కూడా.

ఇక వీటిలో సౌకర్యాలు విమానాల్లోలా మార్చాలని భావించిన ఏపీ సర్కారు, ప్రతి సీటుకూ ఓ ఎల్ఈడీ మానిటర్, దాన్ని ఆపరేట్ చేసే బటన్లు హ్యాండ్ రెస్ట్‌పై, పక్క వారికి ఇబ్బంది కలుగకుండా హెడ్ ఫోన్స్ అమర్చింది.

ఇక వీటిల్లో ప్రయాణికులకు మరింత అనుభూతి కలిగించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి నియమించింది. వీరంతా ప్రయాణికులతో ఫ్లైట్ అటెండెంట్ల మాదిరే మర్యాదగా వ్యవహరిస్తారు. బస్సులో తాగునీరు, చలివేస్తే బ్లాంకెట్, చిప్స్, కుర్ కురే వంటి స్నాక్స్ (డబ్బులిచ్చే కొనుక్కోవాలి) అందుబాటులో ఉంచింది.

ఇక కొసమెరుపు ఏంటంటే, రెండు పెగ్గులు మందేసి బస్సెక్కి హాయిగా నిద్రపోదామని భావించిన వారికి ఈ బస్సుల్లో ఇబ్బందులు తలెత్తనున్నాయి. అమరావతి బస్సుల్లో మద్యం సేవించిన వారిని ఎక్కనీయబోమని ముందస్తు ప్రచారం చేస్తామని ఆర్టీసీ తెలిపారు.

అమరావతి బస్సు

అమరావతి బస్సు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) కొంత పుంతలు తొక్కుతోంది. విమానాల్లో మాత్రమే ఉండే సౌకర్యాలను ఆర్టీసీ బస్సుల్లో కూడా కల్పించేస్తోంది.

అమరావతి బస్సులు

అమరావతి బస్సులు

విమానాల్లో ఎక్కగానే నవ్వుతూ పలకరించే అటెండెంట్, సామాన్లు అందుకుని ర్యాక్ లో పెట్టి, సీటులో కూర్చోగానే చాక్లెట్ లు తెచ్చిచ్చి, ఆపై మంచినీరు, తినుబండారాలు, ముందుగా ఆర్డర్ చేస్తే మీల్స్.. వీటన్నింటికీ మించి ఇన్డివిడ్యువల్ ఎంటర్టెయినింగ్ సిస్టమ్ ఉండటం సాధారణమే.

అమరావతి బస్సులు

అమరావతి బస్సులు

కాగా, ఈ సౌకర్యాలన్నింటినీ విజయవాడలో సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన 'అమరావతి' బస్సుల్లో కల్పించారు.

అమరావతి బస్సులు

అమరావతి బస్సులు

ఈ బస్సుల్లో తొలిరోజు ప్రయాణం చేసిన వారు 'వాహ్... సూపర్బ్' అంటూ వాటికి కితాబిచ్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+