విశాఖ స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్ మార్పు-రేపట్నుంచే..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుపుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (vande bharat express)రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో పెరుగుతున్న రద్దీ, ప్రయాణికుల డిమాండ్, స్థానిక పరిస్ధితుల ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నారు. వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారు ఎప్పటికప్పుడు ఈ మార్పుల్ని తెలుసుకుని ప్రయాణాలు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా విశాఖపట్నం స్టేషన్ కు వచ్చే ఓ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు టైమింగ్ లో స్వల్పమార్పు జరిగింది.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి నడుపుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20707 టైమింగ్ లో తూర్పు కోస్తా రైల్వే స్వల్ప మార్పు చేపట్టింది. విశాఖపట్నం స్టేషన్ లో అంతకంతకూ పెరిగిపోతున్న రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేశారు. ఇప్పటివరకూ సికింద్రాబాద్ నుంచి విశాఖకు వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 1.45కు వస్తుండగా... దీన్ని కాస్తా మరో ఐదు నిమిషాల టైం పొడిగించి 1.50కు వచ్చేలా మార్పు చేశారు.

In order to decongest the terminal, the arrival timings of following trains at Visakhapatnam has been revised.
— East Coast Railway (@EastCoastRail) February 18, 2026
*Secunderabad-Visakhapatnam Vande Bharat
*Durg-Visakhapatnam Vande Bharat#Passengeradvisory #ECoRupdate @RailMinIndia pic.twitter.com/ME6zAZTPtN
ఈ మార్పు రేపటి నుంచి అమల్లోకి వస్తుందని తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మినహా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకల్లో ఎలాంటి మార్పులూ లేవు. ఇప్పటికే పూర్తి రద్దీతో నడుస్తున్న ఈ రైలులో ప్రయాణాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకోవాల్సి వస్తోంది. చివరి నిమిషంలో ప్రయాణాలు చేయాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. అయితే విశాఖ స్టేషన్లో ప్రస్తుతం చేసిన ఐదు నిమిషాల సమయం మార్పు ప్రభావం ప్రయాణికులపై అంతగా ఉండకపోవచ్చు. మరోవైపు విశాఖ స్టేషన్లో రద్దీ కాస్త తగ్గుతుంది. మరోవైపు దుర్గ్ నుంచి విశాఖకు వచ్చే మరోవందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20829 టైమింగ్ లోనూ మార్పు చేశారు. మధ్యాహ్నం 1.50కు విశాఖకు రావాల్సిన ఈ రైలును ఐదు నిమిషాలు ఆలస్యంగా 1.55కు వచ్చేలా మార్చారు.
-
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం: ఎయిర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ విధింపు -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications