వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదంలో పవన్ కల్యాణ్ "వారాహి" - మార్చాల్సిందే..!!

|
Google Oneindia TeluguNews

'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్. అంటూ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రధాన్ని సిద్దం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రచార వాహనాన్ని తయారు చేసారు. ప్రత్యేక వసతులు అందులో కల్పించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసి వాహనం వినియోగించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు ఈ వాహనం సిద్దం అవుతూనే షూటింగ్ లో ఉన్న పవన్ వద్దకు తీసుకెళ్లారు. తన ప్రచార రధం గురించి పవన్ స్వయంగా ట్వీట్ చేసారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేసారు. ఇప్పుడు ఇదే వాహనం పైన ఒక వివాదం మొదలైంది.

'వారాహి'...మార్పులు చేయాల్సిందేనా..

'వారాహి'...మార్పులు చేయాల్సిందేనా..


పవన్ కల్యాణ్ కోసం సిద్దచేసిన వారాహి పైన కొత్త వివాదం మొదలైంది. ఈ వాహనం మొత్తం యుద్ద వాహనం తరహాలో కనిపిస్తోంది. ఆధునిక సదుపాయాలు..ప్రత్యేక వసతులతో దీనిని సిద్దం చేసారు. ఇంకా చేయాల్సిన మార్పుల గురించి పవన్ సూచించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయని జనసేన నేతలు వెల్లడించారు. ఈ వాహనం ద్వారా ప్రజల మధ్యకు ప్రచారానికి వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారు. పవన్ ప్రచార రధం..వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అంటూ పెద్ద ఎత్తన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వాహనం చూసిన తరువాత ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు..ప్రభుత్వాల నిర్ణయాలు తెర మీదకు వస్తున్నాయి.

ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి..


పవన్ కోసం సిద్దం చేసిన ఈ వాహనం కోసం ఆలివ్ గ్రీన్ కలర్ వినియోగించారు. వాహనం మొత్తం ఇదే రంగులో దర్శనమిస్తుంది. అయితే, నిబంధనల ప్రకారం రక్షణ రంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడటంపై నిషేధం ఉంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోనూ అక్కడి ప్రభుత్వం ఇదే అంశం పైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆలివ్ గ్రీన్ లో ఉన్న వాహనాలు వెంటనే రంగు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, ఇప్పుడు పవన్ వాహనం కూడా ఇదే రంగులో ఉండటంతో మార్పు తప్పదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికార ప్రక్రియ పూర్తి కాలేదు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఈ రంగు వినియోగం పైన అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పవన్ ఏం చేయబోతున్నారు

పవన్ ఏం చేయబోతున్నారు


దీంతో, సైన్యం వినియోగంచే రంగు కావటంతో ప్రయివేటు వాహనాలకు వినియోగించకూడదనే నిబంధన దేశ వ్యాప్తంగా అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు పవన్ ఈ అంశం పైన పునరాలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల యుద్దానికి సిద్దమనే నినాదంతో ముందుకు వెళ్తున్న సమయంలో..ఈ రంగు ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీని పైన జనసేన నేతలు అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన స్పష్టత తీసుకున్న తరువాత పవన్ వాహనం విషయంలో అవసరమైన మార్పుల దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
New contrvoersy on Pawan Kalayn Election campaign Vehicle Varahi, the colour used for this vehicle is objected by officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X