సుబ్బారెడ్డి..మేకపాటి కి నో ఛాన్స్ : మాగుంట..ఆదాల కు ఎంపి సీట్లు : కిల్లి కృపారాణికి దక్కని సీటు.
వైసిపి ఎపి అభ్యర్ధులను ప్రకటించింది. అందులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అభ్యర్ధులను పక్కన పెట్టింది. వారి స్థానంలో టిడిపి నుండి చేరిన వారికి ఎంపి సీట్లు కేటాయించింది. ఇక, మాజీ మంత్రి కిల్లి కృపారాణికి సీటు దక్కలేదు. శనివారం పార్టీలో చేరిన వంగా గీతకు కాకినాడ సీటు ప్రకటించారు. నాలుగు లోక్‌సభ సీటు మహిళలకు కేటాయించారు.

ఆ ఇద్దరికీ నో ఛాన్స్...
వైసిపి లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డి..మేకపాటి రాజమోహన రెడ్డికి ఈ సారి సీట్లు కేటాయించలేదు . సుబ్బారెడ్డి ఒంగోలు..రాజమోహన రెడ్డి నెల్లూరు స్థానాల నుండి ఎంపీలుగా ఉన్నారు. వారు ఏపికి ప్రత్యేక హోదా కో సం పదవులకు రాజీనామా చేసారు. అయిదుగురు ఎంపీలు రాజీనామా చేయగా అందులో ఈ ఇద్దరికి సీట్లు ఇవ్వలేదు. మరో ఎంపి వరప్రసాద్ ను గూడూరు ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. ఇక, రాజంపేట, కడప నుండి సిట్టింగ్ ఎంపీలకే తిరిగి అవకాశం కల్పించారు. ఒంగోలు నుండి సుబ్బారెడ్డి స్థానంలో నిన్ననే పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు. మేకపాటి కుటుంబం నుండి సోదరుడు చంద్ర శేఖర రెడ్డి, తన యుడు గౌతం కు ఆత్మకూరు సీటు కేటాయించారు. ఇక, సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తామని..పార్టీ గెలుపు కోసం పని చేయాని జగన్ కోరారు.

మహిళలకు నాలుగు లోక్‌సభ సీటు..
వైసిపి లో ఈ సారి నాలుగు లోక్‌సభ సీట్లు మహిళలకు కేటాయించారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా సీటు కేటాయించలేదు. ఇక, అనకాపల్లి నుండి డాక్టర్ సత్యవతికి కేటాయించారు. అక్కడ సీటు ఇప్ప టి వరకు కళ్యాణి ఆశించారు. అమలాపురం నుండి తొలి నుండి ప్రచారంలో ఉన్న చింతా అనురాధ పేరు ఖరారైంది. అరకు నుండి కమ్యూనిస్టు నేత దేముడు కుమార్తె గొడ్డేటి మాధవి కి కేటాయించారు. ఒక, కాకినాడ నుండి అనూహ్యంగా చివరి నిమిషంలో పార్టీ లో చేరిన రాజ్యసభ మాజీ సభ్యురాలు వంగా గీత కాకినాడ లోక్‌సభ సీటు దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ ఇప్పుడు టిడిపి ఎంపి అభ్యర్దిగా కాకినాడ నుండి పోటీ చేస్తున్నారు.

కొత్త వారికి ఎంపీలుగా అవకాశం..
టిడిపి నుండి వైసిపి లో చేరిన బల్లి దుర్గప్రసాద్ కు తిరుపతి లోక్‌సభ సీటు కేటాయించారు. ఇప్పటి వరకు అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరప్రసాద్ నెల్లూరు జిల్లా గూడూరు నుండి పోటీ కి దిగుతున్నారు. ఈ సారి వైసిపి నుండి లోక్ సభ బరిలో కొత్త అభ్యర్ధులకు అవకాశం ఇచ్చారు. అరకు - గొడ్డేటి మాధవి, విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ,
అనకాపల్లి - డాక్టర్ సత్యవతి, అమలాపురం - చింతా అనురాధ, రాజమండ్రి - మర్గాని భరత్, నరసాపురం - రఘురామ కృష్ణంరాజు, ఏలూరు - కోటగిరి శ్రీధర్, విజయవాడ - పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), నరసారావుపేట - లావు కృష్ణదేవ రాయలు, బాపట్ల - నందిగం సురేశ్, నంద్యాల - పీ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు - డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్, అనం తపురం - తలారి రంగయ్య, హిందుపురం - గోరంట్ల మాధవ్, చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప వంటి అభ్యర్ధులను బరిలోకి దింపారు.












Click it and Unblock the Notifications