కాపు కాస్తారనుకుంటే కవ్విస్తున్నారు..! కాపులతో బాబుకు కొత్త చికాకులు..!!

కాకినాడ/హైదరాబాద్ : కాపు సామాజికవర్గం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు కు అడియాశలు తప్పేలా కనిపించడం లేదు. కాపు నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళకలిగిస్తున్న చంద్రబాబు కోటరీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభ‌యగోదావ‌రి జిల్లాల్లో కీల‌క రాజ‌కీయ శ‌క్తిగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం కీల‌క నిర్ణయం దిశ‌గా అడుగులు వేస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచిన ఈ వ‌ర్గం 2109 ఎన్నిక‌ల నాటికే రూటు మార్చింది.

ఈ క్రమంలోనే కాపు వ‌ర్గంలో టీడీపీకి ప‌డ‌తాయ‌ని భావించిన ఓట్లు పూర్తిగా దారిమ‌ళ్లాయి. దీనిపై టీడీపీ ఆత్మ ప‌రిశీల‌న ప్రారంభించింది. కాపుల‌కు మనం ఎంతో చేశాం. అయినా ఆ వ‌ర్గం మ‌న‌కు ఎందుకు దూర‌మైంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవ‌ల నిర్వహించిన స‌మీక్షలో ఆశ్చర్మం వ్యక్తం చేశారు.

 కాపులకు టీడిపి పెద్ద పీట..! ఐనా కష్ట కాలంలో పార్టీని కాదంటున్న నేతలు..!!

కాపులకు టీడిపి పెద్ద పీట..! ఐనా కష్ట కాలంలో పార్టీని కాదంటున్న నేతలు..!!

నిజ‌మే..! టీడీపీ ప్రభుత్వం గ‌డిచిన ఐదేళ్ల కాలంలో కాపుల‌కు అనేక రూపాల్లో సాయం చేసింది. కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు నిజానికి సంచ‌ల‌న నిర్ణయం. కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించి విద్యానిధి వంటి కార్యక్రమాల‌ను కూడా చంద్రబాబు అమలు చేశారు. అదే స‌మ‌యంలో విదేశాల‌కు వెళ్లి చ‌దువుకునే వారికి కూడా చంద్రబాబు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, 2014 నాటి కాపు రిజ‌ర్వేష‌న్ విష‌యంపైనా అసెంబ్లీలో తీర్మానం చేసి, అప్పట్లోనే కేంద్రానికి పంపారు. త‌న మంత్రి వ‌ర్గంలోనూ కాపుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

Recommended Video

    టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం మంచి పద్దతి కాదు - చంద్రబాబు
     కార్పస్ ఫండ్ పేరుతో నిధుల కేటాయింపు..! బాబుకు దూరమయ్యేందుకు కాపుల నిర్ణయం..!!

    కార్పస్ ఫండ్ పేరుతో నిధుల కేటాయింపు..! బాబుకు దూరమయ్యేందుకు కాపుల నిర్ణయం..!!

    అయిన‌ప్పటికీ కాపులు ఎందుకు దూర‌మ‌య్యార‌నే విష‌యంపై పెద్ద ఎత్తున ఆయ‌న విస్మయం వ్యక్తం చేశారు. అయితే కాపు స‌మాజం మాత్రం బాబు త‌మ‌కు అన్యాయం చేశార‌ని, త‌మకు స్వాతంత్య్రం లేకుండా వ్యవ‌హ‌రించార‌ని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ త‌మ వాయిస్‌ను వినిపించే అవ‌కాశం లేకుండా చేశార‌ని ఆరోపిస్తోంది. ఇదే స‌మ‌యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపుల‌పై దృష్టి పెట్టింది.

     పూటకో మీటింగ్..! రోజుకో మాట..!!

    పూటకో మీటింగ్..! రోజుకో మాట..!!

    కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ చీఫ్‌గా ఉండ‌డంతో కాపు వ‌ర్గాన్ని సాధ్యమైనంత ఎక్కువ‌గా పార్టీలోకి ఆహ్వానించే బాధ్యత‌ను ఆయ‌న‌కు అప్పగించిన‌ట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవిని సైతం పార్టీలోకి ఆహ్వానించి ఆ వ‌ర్గాన్ని ఆక‌ర్షించే ప్రయ‌త్నాలు అప్పుడే ప్రారంభ‌మ‌య్యాయి. జరుగుతున్న పరిణామాలను బ‌ట్టి టీడీపీకి కాపులు గుడ్ బై చెప్పే రోజులు అతి స‌మీపంలోనే ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఫైన‌ల్‌గా ఒక్కటి మాత్రం నిజం టీడీపీని కాపులు న‌మ్మి మాత్రం ఆ పార్టీలో ఉండ‌డం లేద‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది.

     ప్రశాంతంగా పవన్..! వేచి చూసే ధోరణిలో గబ్బర్ సింగ్..!!

    ప్రశాంతంగా పవన్..! వేచి చూసే ధోరణిలో గబ్బర్ సింగ్..!!

    ఎన్నికలు ముగిశాక ఏ టెన్షను పడకుండా ఏపీలో ఎవరైనా ఉన్నారంటే... అది పవన్ అని అనిపించేలా పోలింగ్ అనంతరం పీకే చాలా మౌనంగా ఉన్నారు. తెలుగుదేశం నేతలు అభిమానులు, వైసీపీ నేతలు, అభిమానులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ బిజీగా ఉండగా... జనసేన అధినేత మాత్రం తాపీగా ఉన్నారట. ఈ విషయాన్ని నాగబాబు కూడా పలుమార్లు చెప్పాడు. పోనీ ఆయన తాపీగా ఉండినిలే గానీ ఫలితాల్లో కనీసం తామే గెలుస్తామని కూడా ఒక్క మాట మాట్లాడకపోవడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.దీంతో ఏపి కాపులకు ముందుండి నడిపించే నేత కరువైనట్టు ప్రచారం జరుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+