వెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం - న్యూజెర్సీ సెనేట్ లో తీర్మానం..!!

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు మరో అరుదైన గౌరవం లభించింది. వివిధ రంగాల్లో వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీ, సెనేట్లో సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సేనేటర్ డయాగ్నన్, జనరల్ అసెంబ్లీ సభ్యులు కారాబిన్చక్, స్టేన్లి ఈ సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన పత్రాన్ని గుర్తిస్తూ సెనేట్ ప్రెసిడెంట్ నికోలస్ పి స్కటారి, జనరల్ అసెంబ్లీ స్పీకర్ కైగ్ జె కఫ్లిన్ సంతకాలు చేశారు.

ఈ తీర్మానంలో వెంకయ్య సేవలను ప్రశంసిస్తూ పలు కార్యక్రమాలను ప్రస్తావించారు. వెంకయ్య సేవలను వివరించారు. న్యూ జెర్సీ, అమెరికా వ్యాప్తంగా ప్రవాస భారతీయుల ప్రయోజనాల కోసం వెంకయ్య నాయుడు విశేష కృషి చేస్తున్నారని తీర్మానంలో పేర్కొన్నారు.

New Jersy Senate honoured Venkaiah Naidu by the joint legislative resolution on his public service

భారత్ లో విశేష ప్రజాభిమానాన్ని చూరగొన్నారని చెప్పుకొచ్చారు. వెంకయ్యనాయుడు సమాజంలో సానుకూల మార్పులకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించిన వెంకయ్య నాయుడు ఆ పదవిని అలంకరించక ముందు కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టారని గుర్తు చేసారు.

ప్రజా జీవితంలో ఎలా మెలగాలో, మానవాళికి ఎలా సాయపడాలో వెంకయ్య నాయుడు తన చర్యల ద్వారా ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. . భారత్,అమెరికా మధ్య రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి శ్రీ వెంకయ్య నాయుడు చేసిన కృషిని గౌరవిస్తూ ఈ సంయుక్త సభ ఆయన సేవలను గుర్తించడం సబబు..అంటూ ఆ తీర్మానంలో ప్రశంసించారు. ఈ తీర్మాన పత్రాన్ని అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన తానా 23వ మహాసభల సందర్భంగా న్యూ జెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యుడు స్టేన్లీ ..వెంకయ్య నాయుడుకు అందజేశారు.

New Jersy Senate honoured Venkaiah Naidu by the joint legislative resolution on his public service

వెంకయ్య నాయుడు స్పందిస్తూ ఈ తీర్మానం వసుధైక కుటుంబ స్ఫూర్తి ధర్మాన్ని ఆచరించే భారతీయతకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తానా సభల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు తెలుగు గొప్పదనం..భాషను కాపాడటంతో సంఘం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. తానా ప్రతినిధులు వెంకయ్యను సత్కరించారు. తానా సభల్లో భాగంగా రెండో జరిగిన కార్యక్రమంలో తెలుగు శోభ వికసించింది. ఆధ్మాత్మిక జీవితం పై సద్గురు జగ్గీ వాసుదేవన్ ప్రసంగించారు. మహాసభల్లో భాగంగా కృష్ణుడి రూపంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+