శాసన సభ్యురాలిగా బద్వేలు సుధ ప్రమాణం: వైసీపీ ఎమ్మెల్యేల్లో కుప్పం, నెల్లూరు జోష్
అమరావతి: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ సుధ.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రమాణం చేయించారు. శాసన సభ సభ్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానంటూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర సభ్యులు ఆమెను అభినందించారు.
డాక్టర్ సుధ.. వైఎస్ఆర్సీపీకి చెందిన దివంగత బద్వేలు సిట్టింగ్ శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య భార్య. ఆయన మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. వైసీపీ తరఫున డాక్టర్ సుధ పోటీ చేశారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికను బహిష్కరించింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. తమ అభ్యర్థులను నిలబెట్టాయి. డాక్టర్ సుధ 90 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైఎస్ జగన్ పులివెందులలో సాధించిన ఓట్ల కంటే ఇది అధికం.

ఈ ఉదయం సభకు వచ్చిన డాక్టర్ సుధను తోటి సభ్యులు అభినందనల్లో ముంచెత్తారు. కడప జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ భాషా, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు డాక్టర్ సుధకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మహిళా ఎమ్మెల్యేలు ఆమెతో చాలాసేపు మాట్లాడటం కనిపించింది. మెజారిటీలో ముఖ్యమంత్రినే దాటేశారంటూ ప్రశంసించారు. ఆ నమ్మకాన్ని, విశ్వసనీయతను నిలబెట్టుకోవాలని చెప్పారు.
కాగా- వైసీపీ ఎమ్మెల్యేల్లో మున్సిపాలిటీ ఎన్నిక ఫలితాల జోష్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రత్యేకించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న అన్ని డివిజన్లనూ సొంతం చేసుకోవడం, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీపై పార్టీ జెండా ఎగరడం.. వైసీపీ నేతలను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌ను కలిశారు. తమ ఆనందాన్ని పంచుకున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్.. మర్యాదపూరకంగా వైఎస్ జగన్‌ను కలిశారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను క్లీన్‌స్వీప్ చేసినందుకు ఆయనను ముఖ్యమంత్రి అభినందించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ వెంట ఉన్నారు. దర్శిలో ఓటమి గురించి వైఎస్ జగన్ ఆరా తీసినట్లు చెబుతున్నారు. లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications