ఉద్దండుల సరసన పవన్.. కొత్త కింగ్ మేకర్..!!
Chandrababu Naidu: దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి వరుస భేటీలను నిర్వహిస్తోన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 272. దీనికి 20 సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి. 292 సీట్లకు పరిమితం అయింది. సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ. ఆ పార్టీకి దక్కింది 240 స్థానాలే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరం.

అటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఇతరులు 17 చోట్ల గెలిచారు. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ప్రస్తుతానికి అందుకోలేకపోయిందీ ఇండియా అలయెన్స్. దీనితో తటస్థ పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేజిక్ ఫిగర్‌ను అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోదలచుకోలేదు కాంగ్రెస్.
ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ.. ఢిల్లీలో సమావేశమైంది. బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లోఈ సమావేశం కొద్దిసేపటి కిందటే మొదలైంది.

ఈ వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసీనులయ్యారు. జేడీఎస్- హెచ్ డీ కుమారస్వామి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- అజిత్ పవార్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, జేడీయూ- నితీష్ కుమార్, శివసేన- ఏక్‌నాథ్ షిండే, లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)- చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ ఆవామీ మోర్చా- జీతన్ రామ్ మాంఝీ వేదికపై కూర్చున్నారు.
ఇందులో పాల్గొనడానికి వచ్చిన పవన్ కల్యాణ్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన పలువురు ఎంపీలు ఆయనతో మాట్లాడటం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కనిపించింది.












Click it and Unblock the Notifications