పెళ్లయిన 4 నెలలకే విషాదం: ఆ విషయంలో మనస్పర్థలు, భార్యాభర్తల ఆత్మహత్య!
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా రొయ్యలగూడెం మండలం చొప్పనరామన్నగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి నాలుగు నెలలు తిరగకుండానే ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన విజయరాజు, ప్రియాంకలకు 4నెలల క్రితం పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత కాపురం ఎక్కడ పెట్టాలనే విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. హైదరాబాద్ వెళ్దామని భార్య.. గ్రామంలోనే ఉందామని రాజు వాదించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. ఆపై ఏమైందో ఏమో తెలియదు కానీ అర్థరాత్రి సమయంలో ప్రియాంక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక ఆత్మహత్యతో మనస్థాపం చెందిన విజయరాజు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్త జంట అఘాయిత్యానికి పాల్పడటంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications