పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య: వధువు మృతి
హైదరాబాద్: పెళ్లైన మూడు రోజులకే నూతన వధూవరులు ఆత్మహత్యకు ప్రయత్నించడం స్ధానికంగా కలకలం సృష్టించింది. గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనలో వధువు మృతిచెందగా వరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.
ఈ సంఘటన అనంతరపురం జిల్లా తాడిపత్రిలోని నంద్యాల రోడ్డు కాలనీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన పకీరప్ప (25)కు అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మీ (20)తో ఈ నెల 8న వివాహమైంది.
అయితే బుధవారం నూతన వధూవరులు ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసిన కుటుంబ సభ్యులకు రక్తపు మడుగులో పడి ఉన్న నూతన వధూవరలు కనిపించారు.

వెంటనే హూటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే నూతన వధువు విజయలక్ష్మీ చనిపోయింది. వరుడు పకీరప్ప పరిస్ధితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తగా పెళ్లైన జంట తీసుకున్న నిర్ణయంతో బంధువలంతా శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications