వైసీపీ మాజీ మంత్రి - ఎంపీకి టికెట్ లేనట్లే : సీఎం జగన్ తాజా నిర్ణయంతో..!!?
వచ్చే ఎన్నికల దిశగా సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పార్టీ రీజనల్ ఇంఛార్జ్ లు.. జిల్లా అధ్యక్షుల మార్పు నిర్ణయం తీసుకున్న జగన్ మరో కీలక నిర్ణయానికి సిద్దం అవుతున్నారు. ఎమ్మెల్యేల పని తీరు పైన ఇప్పటికే మూడు రకాలుగా ముఖ్యమంత్రి సర్వేలు చేయించారు. ఎమ్మెల్యేల పని తీరు..గెలుపే ప్రామాణికంగా చేసిన సర్వే నివేదికలు సీఎం వద్దకు చేరాయి. దీంతో, ఎవరికి సీట్లు ఇవ్వాలనే దాని పైన సీఎం జగన్ స్పష్టతతో ఉన్నారు. దీంతో..టికెట్ల కేటాయింపులో తాజాగా మాజీ మంత్రికి ఈ సారి అవకాశం లేదని తెలుస్తోంది.

కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్..
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టికెట్ల కేటాయింపు పైన పూర్తి సమాచారం సేకరించారు. ప్రాంతీయ - సామాజిక సమీకరణాలతో అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో సలహాదారు సజ్జలతో పాటుగా మాజీ మంత్రులు అవంతి, అనిల్, కొడాలి నాని, ప్రస్తుత మంత్రి బుగ్గనను ప్రాంతీయ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. అదే విధంగా మాజీ మంత్రులకు ఇచ్చిన జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి పలువురిని పని తీరు ఆధారంగా మార్పులు చేసారు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్యే వంతు వచ్చింది. గతంలోనే 27 మంది ఎమ్మెల్యేల పని తీరు పైన హెచ్చరిక లు చేసిన సీఎం జగన్ వచ్చే నెల 14న మరోసారి ఎమ్మెల్యేతో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు.. తాజా నివేదికలను వెల్లడించనున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.

మాజీ మంత్రికి టికెట్ పైన సందేహాలు..
ఇక..ఇప్పుడు వైసీపీ ప్రకాశంలో కొత్త చర్చ జరుగుతోంది. ఇంత మంది తాజా..మాజీ మంత్రులను రీజనల్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన సీఎం జగన్..మాజీ మంత్రి బాలినేని కి మాత్రం కేటాయించిన బాధ్యతలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బాలినేని ఒంగోలు నుంచి పోటీకి సిద్దంగా లేరని,దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు కేటాయించారని ప్రచారం సాగుతోంది. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి బాలినేని మద్దతుగా నిలిచారు. జగన్ కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసారు. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించారు. ఆ సమయంలో నూ బాలినేని మనస్థాపానికి గురయ్యారు. సజ్జల రాయబారం..తరువాత సీఎం జగన్ తో సమావేశం ద్వారా సమస్య పరిష్కారం అయింది. ఇక, ఇప్పుడు బాలినేనికి పార్టీ కీలక బాధ్యతల్లో బాలినేని కొనసాగతున్నారు ఆయన్ను మాత్రం కొనసాగించాలని సీఎం నిర్ణయించారు.

కుమారుడిని బరిలోకి దింపే ప్రయత్నం...
బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని ఎన్నికల్లోకి దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బాలినేని కుమారుడు ప్రతీణ్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ప్రతీ డివిజన్ లోనూ తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఇంటి దగ్గర స్థానికులకు అందుబాటులో ఉంటూ...నియోజకవర్గ ప్రజలతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. తన కుమారుడు పోటీ చేస్తారని వెల్లడించారు. అయితే, బాలినేని తనయుడుకు సీటు ఖాయమని నియోజకవర్గ వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఒంగోలు ఎంపీ..ఎమ్మెల్యేల వారుసులకు టికెట్ల విషయంలో సీఎం జగన్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications